26న హెచ్చరిక అర్జీలు ఇవ్వండి
ఏఐకెఎస్ పిలుపు
ఏఐకెఎస్ నాయకులు
హైదరాబాద్: ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కేంద్ర బిజెపి ప్రభుత్వానికి డిమాండ్లతో కూడిన హెచ్చరిక అర్జీలు జిల్లా కలెక్టర్ లకు అందజేయాలని ఆలిండియా కిసాన్ సంఘటన్(ఏఐకెఎస్) కార్మిక, కర్షకులకు పిలుపునిస్తుంది. ఈ మేరకు గురువారం ఏఐకెఎస్ రాష్ట్ర అధ్యక్షులు సుదమల్ల భాస్కర్ , ప్రధాన కార్యదర్శి మాన్యపు బుజేందర్ ఒక ప్రకటన విడుదల చేశారు. బిజెపి ప్రభుత్వం మూడోవసారి అధికారంలోకి వచ్చినప్పటికీ తన కార్పొరేట్ కంపెనీల అనుకూల విధానాలు మర్చుకోలేదని విమర్శించారు. పారిశ్రామిక రంగంలో కార్మికుల హక్కులను కాలరాసేవిధంగా నాలుగు లేబర్ కోడ్స్ ను తయారు చేయటం దుర్మార్గమైన చర్యలని తెలిపారు. యూనియన్ పెట్టుకునే హక్కు రద్దు, 8 గంటల పనివిధానం నుంచి పనిగంటలు పెంపు లాంటి విధానాలు శ్రామికుల శ్రమను దోచి, బడాకార్పొరేట్ కంపెనీలకు లాభలు అర్జీపెట్టే కార్రకమం చేపడుతున్నారని పేర్కొన్నారు. కనీస వేతనాలు ప్రతి కార్మికుడికి ఏ రంగంవారైనప్పటికి 26వేలు ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించిన అమలు చేయటం లేదన్నారు. కార్మికులు పోరాడి, ప్రాణాలర్పించి సాధించుకున్నా, రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలను, హక్కులను కూడా అమలు చేయకపోగా రద్దు చేస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయరంగంలో అన్ని పంటలకు కనీస మద్ధతు ధర కావాలని ఏడాదిపాటు ఉద్యమాలు చేసిన రైతు పంటకు గిట్టుబాటు ధర కల్పించటం లేదన్నారు. విత్తనాలు, రుణాలు, ఎరువులు, పురుగుమందులు రైతులకు ఉచితంగా అందించాలని డిమాండ్ చేస్తున్నాము. విత్తనచట్టం, రుణవిమోచన చట్టం తేవాలని డిమాండ్ చేస్తున్నాము. కౌలు రైతులకు చట్టబద్ధత కల్పించాలని కోరుతున్నాము. రైతులకు, వ్యవసాయ కూలీలకు ప్రతినెల 10వేలు పెన్షన్ అందించాలని, రుణాలు రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. పై డిమాండ్స్ సాధన కోసం ఈ నెల 26వ తేదీన అన్ని జిల్లా కలెక్టర్ లకు డిమాండ్ లతో కూడిన హెచ్చరిక అర్జీలు అందించాలని, అన్ని సంఘాలతో సంయుక్తంగా నిర్వహించాలని కార్మికులకు, కర్షకులకు విజ్ఞప్తి చేస్తున్నాము.
Comment List