ఉత్తమ వ్యాపారవేత్త అవార్డు అందుకున్న హరిబాబు

హరిబాబు ఎదిగిన తీరు నేటి యువతకు ఆదర్శప్రాయం: సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

On
ఉత్తమ వ్యాపారవేత్త అవార్డు అందుకున్న హరిబాబు

IMG-20241125-WA0993కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్) నవంబర్ 25: తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా లో జరిగిన స్వేరో ఏడవ జాతీయ కన్వెన్షన్ లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన ఏరో సంస్థల అధినేత తాళ్లూరి హరిబాబు ఉత్తమ వ్యాపారవేత్త అవార్డు అందుకున్నారు సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హరి బాబుకు ఉత్తమ వ్యాపారవేత్త పురస్కారాన్ని అందజేశారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్ని అవాంతరాలైన ఎదుర్కొని వెనకడుగు వేయకుండా హరిబాబు అంచలంచెలుగా ఎదిగిన తీరు నేటి యువతకు ఆదర్శప్రాయం అన్నారు హరిబాబు తన తెలివితేటలతో అంచలంచెలుగా ఎదుగుతూ నలుగురికి ఉపాధిని చూపిస్తూ నేడు మేము ఎవరికీ తక్కువ కాదు అని నిజం చేశారు ఒక స్వేరోగా హరిబాబు ఉత్తమ వ్యాపారవేత్త అవార్డు అందుకోవడం మనందరికీ గర్వకారణం అన్నారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ తో తన వ్యాపారాన్ని ప్రారంభించి నేడు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నర్సింగ్ కళాశాలకు అనుమతిని తీసుకొచ్చి తన సొంత ఊరైన పాల్వంచలో నర్సింగ్ కళాశాల ప్రారంభించడం సంతోషిదాయకమని కొనియాడారు. హరిబాబు మాట్లాడుతూ మొక్కవోని ధైర్యం వెనకడుగు వేయని పట్టుదల ఉంటే ఈ ప్రపంచంలో మనకు అసాధ్యం అంటూ ఏమీ లేదు. నేడు ఉత్తమ వ్యాపారవేత్తగా చాలా ఆనందంగా ఉందని నన్ను అనుక్షణం ప్రోత్సహిస్తూ తమ విలువైన సలహాలు సూచనలు అందిస్తూ సహకరించిన సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాకు ఆదర్శంగా నిలిచారని అన్నారు ఈ అవార్డు అందుకోవడానికి సహకరించిన నా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

Views: 25
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఖమ్మం డిసెంబర్ 6 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాధపాలెం మండలం మంగ్య తండా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ ఏకగ్రీవమైనది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోతు భార్గవి...
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్