లక్ష్మీదేవిపల్లి మండలంలో జోరుగా ఇసుక దందా 

పగలు రాత్రి తేడా లేకుండా తొలకాలు

On
లక్ష్మీదేవిపల్లి మండలంలో జోరుగా ఇసుక దందా 

మాజీ ప్రజా ప్రతినిధి అండదండలతో దందా..

లక్ష్మీదేవిపల్లి (న్యూస్ ఇండియా నరేష్) జనవరి 26: భూగర్భ జలాలు అడుగంటుతున్న, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్న, పట్టించుకునే అధికారులు లేకుండా పోయారు.లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రపురం వాగు నుంచి జోరుగా ఇసుక దందా నడుస్తుంది. పగలు రాత్రి తేడా లేకుండా ఇసుక తోలకాలు జరుగుతున్న సంబంధిత శాఖ అధికారులు పట్టింపు లేకుండా పోయింది. ఇంత బహిరంగంగా అంతా మా ఇష్టం అంటూ ఈ ఇసుక దందా జరుగుతుందంటే స్థానిక మాజీ ప్రజాప్రతినిది అండ దండలు పుష్కలంగా ఉన్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పగలు రాత్రి స్థానిక ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా ఇసుక తోలకాలు జరుపుతున్నారు. ఈ ఇసుక ట్రాక్టర్లు డ్రైవర్లు కుడా అతివేగంగా ట్రాక్టర్లు నడపడంతో స్థానికులు ఒకింత భయాందోళనకు  గురవుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.

Views: 87
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News