గణతంత్ర దినోత్సవం అంటే భిన్నత్వంలో ఏకత్వం...

పెద్దకడుబూరు మండలంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.

On
గణతంత్ర దినోత్సవం అంటే భిన్నత్వంలో ఏకత్వం...

స్వాతంత్ర్యయోధ్యమా వీరుల అడుగుజాడల్లో మనమందరం నడవాలి - తహసీల్దార్ శ్రీనాథ్...

న్యూస్ ఇండియా/ పెద్దకడుబూరు మండలం జనవరి 26 :- మండల కేంద్రమైన పెద్దకడుబూరులోని స్థానిక తహసీల్దారు కార్యాలయం నందు తహసీల్దార్ శ్రీనాథ్ అద్వర్యంలో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొదటగా స్వాతంత్ర్య అమరవీరులకు మరియు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి అర్ అంబేద్కర్ గారికి పూల మాలలు వేసి నివాలులు అర్పించారు. అలాగే మూడు రంగుల మువ్వెన్నెల మన భారతదేశ జాతీయ జండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాట్లాడుతూ భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. అలాగే భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా ఆవిర్భవించేందుకు 1950 జనవరి 26లో దీనిని ఒక ప్రజాతంత్ర పరిపాలన పద్ధతితో పాటుగా అమలులోకి తీసుకురావాలని ఆనాడు మన స్వాతంత్ర్య అమర వీరులు నిర్ణయించడం జరిగిందన్నారు. అలాగే మన భారతదేశానికి రాసుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చిన దినంగా మనందరం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే స్వాతంత్ర్య దినంను ఆనాటి పలువురు అమరవీరులు స్వయంగా నిర్ణయించడంతో నెహ్రూ తో పాటు తదితర జాతీయోద్యమనేతలు జనవరి 26ను దేశ గణతంత్ర దినోత్సవంగా ప్రకటించడం జరిగిందన్నారు. ఈ గణతంత్ర దినోత్సవం రోజున మనమందరం కలిసి స్వాతంత్ర్యయోధ్యమా విరులనందరిని కచ్చితంగా స్మరించుకోవాలని, వారి అడుగుజాడల్లో మనం అందరూ కలిసి నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది , పోలిస్ శాఖ సిబ్బంది, మరియు తదితర మండల పెద్దలు పాల్గొనడం జరిగింది...IMG-20250126-WA0261

Views: 29
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మర్రి"తో "మాచన" అనుభందం... మర్రి"తో "మాచన" అనుభందం...
"మర్రి"తో "మాచన" అనుభందం  "మర్రి చెన్నారెడ్డి" లో శిక్షణ అనుభవం.. రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 15, (న్యూస్ ఇండియా ప్రతినిధి): పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్...
ధాన్యం సేకరణ ఓ క్రతువు..
దాహార్తిని తీర్చండి
మినీ మేడారం జాతరకు  ప్రత్యేక బస్సు
డొమెస్టిక్ సిలిండర్లు హోటళ్ళ లో ఎలా ఉన్నాయ్..
ఘనంగా 49వ సింగరేణి హై స్కూల్ వార్షికోత్సవం 
రేషన్ అక్రమార్కులపై పి డి యాక్ట్ ఖాయం..