తొర్రూరు బాలాజీ నర్సింగ్ హోమ్ (సరస్వతి హాస్పిటల్) లో ఇంజక్షన్ వికటించి 9వ తరగతి బాలుడు మృతి

పెద్దలకిచ్చే ఎక్కువ డోసుఇంజక్షన్ ఇవ్వడంతోనే మృతి చెందాడు అంటున్న బంధువులు 

బాలుని కుటుంబానికి న్యాయం చేయాలంటున్న బంధువులు స్థానికులు

ఇంజక్షన్ వికటించి 9వ తరగతివిద్యార్థి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో బాలాజీ నర్సింగ్ హోమ్ (సరస్వతి హాస్పిటల్) నందు ఈరోజు మధ్యాహ్నం జరిగింది. తొర్రూరు మండలం కంటాయపాలెం దాశరోజు నాగరాణి వేణుగోపాల్ కుమారుడైన దాసరోజు సిద్ధార్థ అదే గ్రామంలో పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. గత రెండు మూడు రోజుల నుండి మామూలు జలుబు జ్వరంతో బాధపడుతున్న సిద్ధార్థ ని చికిత్స నిమిత్తం తల్లి నాగరాణి మరియు బంధువులు తొర్రూరు పట్టణంలోని బాలాజీ నర్సింగ్ హోమ్ (సరస్వతి దావకాన)కు తీసుకొని వచ్చారు. డాక్టర్ పరిశీలించి  రక్త మూత్ర పరీక్షలు చేయించి ఇంజక్షన్ తెప్పించి ఇవ్వడంతో బాలుడు క్షణాలలో మృతి చెందాడు. అప్పటిదాకా బాలుడు మాట్లాడుతూ ఉన్నాడు కానీ పెద్దలకు ఇచ్చే ఎక్కువ డోసుఇంజక్షన్ ఇవ్వడంతో బాలుడు శ్వాస ఆడక కళ్ళముందే మృతి చెందడం తట్టుకోలేని బంధువుల అర్ధనాదాలు పలువురిని ఎంతో బాధించాయి. కుటుంబ సభ్యులు బంధువులు స్థానికులు బాలుని కుటుంబాన్ని ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు సిఐ గణేష్ మరియు ఎస్ఐ ఉపేందర్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులో ఉంచుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సింది.

Read More జాతీయ సేవా పథక అవశ్యకత పై అవగాహన కార్యక్రమం... 

Views: 2375
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News