ఘనంగా ప్రారంభమైన పోలీస్ అన్యువల్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్ 

ప్రారంభించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు 

On
ఘనంగా ప్రారంభమైన పోలీస్ అన్యువల్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్ 

IMG20250206091941భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియాబ్యూరోనరేష్) ఫిబ్రవరి 6: జిల్లా పోలీసుల అన్యువల్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్ 2025 ను హేమచంద్రపురం  హెడ్ క్వార్టర్స్ నందు గురువారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పతక ఆవిష్కరణ చేసి ఘనంగా ప్రారంభించారు. జిల్లాలోని సబ్ డివిజన్ కు చెందిన డార్ హెడ్ క్వార్టర్స్, కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, భద్రాచలం, మణుగూరు, డిపిఓ అండ్ స్పెషల్ వింగ్స్, హోంగార్డ్స్ వింగ్స్, విభాగాల కు చెందిన స్పోర్ట్స్ జట్లు నుండి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు గౌరవ వందనం స్వీకరించారు. శాంతి పావురాలను ఎగురవేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సిబ్బందితో స్పోర్ట్స్ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..ఈ స్పోర్ట్స్ మీట్ మూడు రోజుల పాటు 6,7, 8 తేదీ లా పాటు నిర్వహించినట్లు తెలిపారు. స్నేహపూర్వ వాతావరణం లో ఆటలు కొనసాగించాలని కోరారు. గెలుపు ఓటములు సహజమని అన్నారు. ఈ గేమ్స్ వల్ల పనిలో ఒత్తిడిని తగ్గించుకోవచ్చన్నారు. మానసికంగా, ఆరోగ్యంగా మన ఫిట్నెస్ ని పొందవచ్చు అన్నారు. పాల్వంచ మరియు హోంగార్డ్స్ వాలీబాల్ పోటీని ఎస్పీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పి  విక్రత్ కుమార్ సింగ్ , డిఎస్పి అబ్దుల్ రెహమాన్, చంద్రబాను, సతీష్, రవీందర్ రెడ్డి, సిఐలు ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు

Views: 146
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

తాడిచెట్టు పై నుండి జారీన గీత కార్మికుడు  తాడిచెట్టు పై నుండి జారీన గీత కార్మికుడు 
తాడిచెట్టు పై నుండి జారీన గీత కార్మికుడు   న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక  కొడకండ్ల రిపోర్టు గుర్రం ప్రభాకర్   జనగాం జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామంలో...
కార్పొరేషన్ టెండర్లలో గందరగోళం 
గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్
అభివృద్ధి పనుల్లో దూసుకెళ్తున్న పంగిడి గ్రామం
వేల్పూగొండ గ్రామం బోల్లికుంటలో పులి సంచారం
కొత్తగూడెం  హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సులు 
మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో అమ్మ పేరు మీద ఒక మొక్క