విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ...
అలరించిన స్వయం స్వపరిపాలన దినోత్సవం...
ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయ వేషధారణ కుడికాల శృతి, దసారం జ్యోత్న్స శ్రీ విద్యార్థులకు బహుమతులు..
న్యూస్ ఇండియా తెలుగు, మార్చి 04 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)
జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండలంలోని ఇటికాలపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించుకుని విద్యార్థులే ఉపాధ్యాయులయ్యారు.విద్యార్థులు ఉపాధ్యాయులు గా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. విద్య అధికారులు డిఈవో గా నౌషద్, ఎంఈఓ గా అశ్విని, పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా నజుమ గా పాత్రలు పోషించారు.ఉపాధ్యాయులుగా పలురకాల పాత్రలు పోషించి చూపరులకు కనువిందు చేశారు.అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు మాట్లాడుతూ... తాము ఈరోజు ఉపాధ్యాయుల గా విధులు నిర్వహించినందుకు సంతోషంగా ఉందన్నారు.ఉపాధ్యాయుల సమస్యలు స్వయంగా తెలుసుకోవడం జరిగిందని ,అలాగే ఈరోజు తమకు జీవితంలో మర్చిపోలేని రోజు అని విద్యార్థులు అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలు బయటికి తీసుకురావడం జరుగుతుందని తెలియజేశారు.
విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించిన అనుభవాలను సమావేశంలో వివరించారు..
ఈ సందర్భంగా ఎంఈవో వెంకట్ రెడ్డి (పాఠశాల ప్రధానోపాధ్యాయులు) మాట్లాడుతూ... విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే ఉన్నత శిఖరాలు చేరవచ్చని అన్నారు.విద్యార్థులు నైతిక విలువలు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అభ్యసించాలని విద్య ఒక్కటెే మనల్ని సమాజంలో ఉన్నత స్థాయిలో నిలబెట్టగలదని పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయ వేషధారణ కుడికాల శృతి,దసారం జ్యోత్న్స శ్రీ విద్యార్థులకు బహుమతులు అందజేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు జీవరత్నం, విష్ణుకుమార్,శ్రీనివాస్, సంతోష్, ప్రభావతి ,ఐజాక్ , ముస్తఫా ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
Comment List