ఘనంగా  శ్రీ రామనవమి  వేడుకలు..

జై శ్రీరామ్ నామస్మరణతో దేవాలయ ప్రాంగణం మార్మోగించారు.

On
ఘనంగా  శ్రీ రామనవమి  వేడుకలు..

ఘనంగా  శ్రీ రామనవమి  వేడుకలు..

ఎల్బీనగర్, ఏప్రిల్ 07, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఎల్బీనగర్ లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామ నవమి  ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సందర్భంగా ఆలయంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రాంగణం  భక్తులతో నిండిపోయింది. రాములవారి మంగళధ్వని మేళాలతో, హారతులతో, పూలతో, మంగళకలశాలతో ఘనంగా వేడుకలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జై శ్రీరామ్ అనే నామస్మరణతో దేవాలయ ప్రాంగణం మొత్తం మార్మోగించారు. పల్లకీసేవ, రథోత్సవం వంటి ప్రత్యేక కార్యక్రమాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ప్రాంతీయ ప్రజలు, భక్తులు, యాత్రికులు ఈ ఉత్సవాల్లో భాగస్వాములై, భక్తి భావంతో రామనామాన్ని జపిస్తూ శ్రీరాముని కృపకు పాత్రులయ్యారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల  సదుపాయాలు కల్పించామని ఆలయ ట్రస్టి వ్యవస్థాపకులు మరియు చైర్మన్ గుంటి లక్ష్మణ్ తెలిపారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా భక్తులు అధికంగా పాల్గొంటున్నారని, ఈ కల్యాణ వేడుకల్లో సుమారు ఐదువేల మంది భక్తులు పాల్గొన్నారన్నారు. స్వామి వారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారు సూచించారు. సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ప్రేమ్ కుమార్, అర్చక సంఘం, భక్తులు తదితరులు పాల్గొన్నారు.IMG-20250406-WA2358

Views: 7

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..