రాజకీయాల్లో కృష్ణ స్టైల్లే వేరు

On

రాజకీయాల్లోనూ సూపర్‌ స్టార్‌ కృష్ణ తనదైన ముద్ర వేశారు. రామారావు, కృష్ణ మధ్య రాజకీయ విభేదాలొచ్చాయి.. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాదెళ్ళ భాస్కరరావు కూలదోసి ముఖ్యమంత్రి అయినప్పుడు భాస్కరరావును కృష్ణ అభినందిస్తున్నట్టు ఫుల్‌పేజీ ప్రకటన విడుదల కావడం.. ఈ సంఘటన కృష్ణకి, రామారావుకి మధ్య విభేదాలు తీసుకొచ్చింది. ఎన్.టి.రామారావు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ విభేదాలు రాజుకున్నాయి. ఇక, 1984 అక్టోబరులో ఇందిరా గాంధీ దారుణహత్యకు గురైనప్పుడు కృష్ణ ఆమె అంత్యక్రియలకు ఢిల్లీ వెళ్లారు.. […]

రాజకీయాల్లోనూ సూపర్‌ స్టార్‌ కృష్ణ తనదైన ముద్ర వేశారు. రామారావు, కృష్ణ మధ్య రాజకీయ విభేదాలొచ్చాయి..

1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాదెళ్ళ భాస్కరరావు కూలదోసి ముఖ్యమంత్రి అయినప్పుడు భాస్కరరావును కృష్ణ అభినందిస్తున్నట్టు ఫుల్‌పేజీ ప్రకటన విడుదల కావడం.. ఈ సంఘటన కృష్ణకి, రామారావుకి మధ్య విభేదాలు తీసుకొచ్చింది.

ఎన్.టి.రామారావు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ విభేదాలు రాజుకున్నాయి. ఇక, 1984 అక్టోబరులో ఇందిరా గాంధీ దారుణహత్యకు గురైనప్పుడు కృష్ణ ఆమె అంత్యక్రియలకు ఢిల్లీ వెళ్లారు..

ప్రధాన మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ గాంధీని కలిశారు.. ఇదే సమయంలో.. రామారావు మాస్‌ అప్పీల్‌ తెలుగుదేశం పార్టీకి ప్లస్‌ అవుతోంది..

అలాంటి ప్రజాకర్షణ ఉన్న కృష్ణ కాంగ్రెస్ పార్టీకి ఉపకరిస్తాడని కాంగ్రెస్ నాయకులు భావించారు. ఆయన్ను పార్టీలో చేరాలని ప్రోత్సహించారు. అలా 1984లో కృష్ణ కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.

ఆ తర్వాత తెలుగునాట..ప్రభుత్వ చర్యలను వ్యంగ్యంగా విమర్శిస్తూ సినిమాలు చేశారు..ఆ క్రమంలో వచ్చినవే మండలాధీశుడు, సాహసమే నా ఊపిరి ఇంకా ఇతర సినిమాలు.. కృష్ణ 80వ దశకంలో పలు రాజకీయ నేపథ్యంలోని సినిమాలు చేయడం వెనుక ఉన్నదీ ఇదే కారణం.

1989లో కృష్ణ కాంగ్రెస్ తరఫున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎంపీగా గెలిచారు.

1991 లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణ గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం కోరుకున్నా తిరిగి ఏలూరులోనే పార్టీ పోటీచేయించింది.. ఆ ఎన్నికల్లో కృష్ణ ఓడిపోయారు. ..2009లో ఎన్నికల్లో వైఎస్‌ కోరిక మేరకు కృష్ణ కుటుంబం కాంగ్రెస్‌కు నైతిక మద్దతు తెలిపింది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం. అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : నమ్మదగిన సమాచారం మేరకు తేది: 08.05.2025 నాడు ఉదయం అందాజ 11:00 గంటల సమయంలో...
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.