పలుమార్లు ప్రభుత్వాన్ని మోసం చేసిన 'జర్నలిస్ట్ మోసగాడు'.
తెలంగాణ హైకోర్టు కు సైతం తప్పుడు సమాచారం ఇచ్చిన తహసీల్దార్. మోసం చెయ్యడం అంటే ఈ 'జర్నలిస్ట్ మోసగాడికి' మంచినీరు త్రాగినట్టు.!!! గతంలో ఈ 'జర్నలిస్ట్ మోసగాడి' పై పోలీస్ స్టేషన్లో కేసులు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 19, న్యూస్ ఇండియా : ప్రభుత్వ ఉద్యోగుల తో కుమ్మకై పాత్రికేయుల అర్హతల ప్రమాణాలు పాటించకుండా, తప్పుడు సమాచార ప్రమాణ పత్రాల ఆధారంగా రెండొవసారి ఇండ్ల స్థలాలను లబ్ది పొందిన 'జర్నలిస్ట్' పై చర్యలు తీసుకోవాలని ‘పిర్యాదు దారుడు ఈశ్వర్’ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేసాడు. గతంలో అవకాశాలను అనుకూలంగా మార్చుకున్న ‘10 టివి రిపోర్టర్ పి. వి రావు’ అనే మోసగాడు కావాలనే దురుద్దేశంతో ప్రభుత్వ అధికారులను సైతం ప్రభావితం చేసి అవినీతికి పాల్పడి ప్రొసీడింగ్స్ నెం. బి / 2246 / 2023 తేదీ. 26-07-2023 ద్వారా అక్రమంగా ‘ఇంటి స్థలం పట్టాలను’ కేటాయింపులు పొందాడని తెలిసింది. కేటాయించిన ఇంటి స్థలం పట్టాలు, అట్టి పట్టాల ద్వారా సంబంధిత గ్రామ పంచాయతీ ద్వారా అక్రమంగా ఇంటి నిర్మాణ అనుమతులు పొందాడని తెలిసింది. ఎలాంటి నిర్మాణాలు జరుపకుండానే, నిర్మితం లేని ఇండ్లకు ఇంటి నంబర్లు కూడా పొందాడని తెలిసింది. ఈ మోసగాడు ప్రభుత్వానికి తప్పుదోవ పట్టించి పచ్చి మోసం చేసినట్టు.. ప్రత్యేక్షంగా, పరోక్షంగా క్రిమినల్ ఆక్టివిటీస్ చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం అందింది. ఈ మోసగాడి తో ప్రభావితం అయిన తహసీల్దార్ అధికారి ఈ క్రిమినల్ చర్యలో భాగంగా సాక్షాత్తు 'తెలంగాణ హైకోర్టు కు' సైతం రిట్ పిటిషన్ నం 24007/ 2023, తేదీ. 29/08/2023, నాడు తహశీల్ధార్, ఫరహీన్ షేక్, ద్వారా వ్రాతపూర్వకంగా తప్పుడు సమాచారం కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేసే విధంగా ప్రభావితం చేశారని, ’ పిర్యాదు లో పేర్కొన్నట్లు తెలిసింది. గతంలో ఈ 'జర్నలిస్ట్ మోసగాడు' చేసిన మోసాలపై పోతిరెడ్డిపల్లి రురల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కబడ్డాయని తెలిసినది. ఈ రకంగానే తప్పుడు ప్రమాణ పత్రాల ద్వారా అధికారులకు మోసంచేస్తూ పలు చోట్ల ప్రభుత్వ పథకాల పేరిట ఇండ్ల స్థలాలు కొట్టేయడంలో ‘10 టివి రిపోర్టర్ పి. వి రావు’ మంచి ప్రవీణ్యం వున్నదని సహచర పాత్రికేయులు చురకలు అంటిస్తుంటారనే విషయం సంగారెడ్డి లో గల పాత్రికేయులకు విదితమే. లోతనై విచారణ చేపడితే ఈయన గారికి ‘ఖమ్మం జిల్లా’ లో కూడా ప్రభుత్వం ద్వారా ఇండ్ల స్థలాలు లబ్ది పొందివున్నాడనే నిజం నిప్పులాగా బయటికి వస్తుందని సాటి పాత్రికేయులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అర్హత కలిగిన పాత్రికేయులకు రావలసిన ప్రభుత్వ లబ్దిని రాకుండా మోసం చేసిన ఈ మోసగాడికి తగిన శాస్తి జరుగవలసిందేనని నష్టం జరిగిన సాటి పాత్రికేయులు బహిరంగంగానే శపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ పూర్తి విచారణ చేపట్టి తగిన విధంగా చర్యలు తీసుకొంటామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చినట్టు పిర్యాదు దారుడు తెలియచేసాడు.
Comment List