అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించడమే లక్ష్యం...

ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి

On
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించడమే లక్ష్యం...

ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేత

సత్తుపల్లి/వేంసూరు: అర్హులైన పేద వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి శుక్రవారం సత్తుపల్లి లోని రాణి ఫంక్షన్ హాల్ లో, వేంసూరు లోని ఉన్నత పాఠశాలలో ఆవరణలో.. అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. సత్తుపల్లి పట్టణం లో 369  మందికి మరియు సత్తుపల్లి మండలం లోని అన్ని గ్రామాల వారీగా మొత్తం 581 మందికి, వేంసూరు మండలంలో 618 మందికి  పేద కుటుంబ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్  మాట్లాడుతూ..గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను పట్టించుకోలేదని అన్నారు. పదేళ్ళ పదవీకాలంలో కాలయాపన చేసిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వచ్చాక.. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపును పేదలు ఒక పండుగలా చేసుకోగలుగుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో పలువురు అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 1
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News