గోడ్డలితో దాడి అవాస్తవం...
శ్రీ మల్లన్న గోర్ల కాపరి సంఘం సభ్యులు...
న్యూస్ ఇండియా తెలుగు, మే 17 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్ )
జనగాం జిల్లా బచ్చన్నపేట మండలంలోని ఇటికాలపల్లి గ్రామానికి చెందిన కాసా ఐలయ్య పై బియ్య లింగయ్య గోడ్డలితో దాడి చేసినట్టు వచ్చిన కథనాలు అవాస్తవమని శ్రీ మల్లన్న గోర్ల కాపరి సంఘం సభ్యులు తీవ్రంగా ఖండించారు.శనివారం రోజున బచ్చన్నపేట మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీ మల్లన్న గోర్ల కాపరి సంఘం సభ్యులు బియ్య లింగయ్య, ఆలేరు ఓజల్,ఆత్కూరి భిక్షపతి మాట్లాడుతూ..కాసా ఐలయ్య భూమిని ఆక్రమించలేదని, అతని భూమిలో చెట్లు నరకలేదని,ఎనిమిది నెంబర్లతో కూడిన 14.0000 ఎకరాల భూమి అని, 12 ఎకరాల 34 గుంటలకు పాస్ బుక్ లు కలిగివున్నామని మిగిలిన 1.0060 కాలేదని , అతను భూ రికార్డు కు కూడా లేడని తెలిపారు.గత 8 నెలల నుంచి సర్వేయర్ ని కోలువకుండా అడ్డు పడ్తూ, భూమి ని కోలువకుండా కోంత మంది అడ్డు పడ్తున్నారని, సర్వేయర్ వచ్చే క్రమంలో భూమి ని చదును చేస్తుండగా, చెట్లను గోడ్డలితో నరుకుతున్న క్రమంలో కాసా ఐలయ్య అక్కడికి వచ్చి గోడ్డాలిని లాక్కున్నే ప్రయత్నంలో కాసా ఐలయ్య క్రింద పడడం జరిగినదని,బియ్య లింగయ్య గోడ్డలితో దాడి చేయాలేదని తెలిపారు.కుల సమక్షంలో కాసా ఐలయ్య తో ఉన్న సమస్యను పరిష్కరించడానికి పలు మార్లు పిలిచిన రాలేదని తెలిపారు.ఈ సమావేశంలో సంఘం సభ్యులు మాధ సత్తయ్య, చెవ్వల్ల సిద్దయ్య,కామల్ల సిద్దయ్య,కాస పర్షరాములు,దయ్యాల సిద్దులు,ఆలేరు వెంకటమ్మ, దయ్యాల సత్తెమ్మ,మ్యాక ఐలమ్మ, కాస కోండవ్వ తదితరులు పాల్గొన్నారు.
Comment List