సీఎం పర్యటన కై సిద్ధమైన ఏర్పాట్లు.

సీఎం కు ఘనంగా స్వాగతం పలుకుదాం - మంత్రి దామోదర్ రాజనర్సింహ

On
సీఎం పర్యటన కై  సిద్ధమైన ఏర్పాట్లు.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 22, న్యూస్ ఇండియా : ఈనెల 23 న సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి అయినట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు  సురేష్ కుమార్ షట్కార్  ,జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, శాసనసభ్యులు సంజీవరెడ్డి  తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. హెలిపాడ్ ను,సీఎం చేతుల మీదుగా ప్రారంభించే బసవేశ్వర విగ్రహం, నిమ్జ్ రోడ్, కేంద్రీయ విద్యాలయ భవనం,సభ స్థలంను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హెలిప్యాడ్ పనులు, ప్రజా వేదిక సభ వేదిక, వి ఐ పి గ్యాలరీ, మీడియా గ్యాలరీ ,వాహనాల పార్కింగ్ పనులు, రూట్ల వారీగా ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రణాళిక వివరాలు, గ్రీనరీ, స్టేజి ఏర్పాట్లు, స్టేజి అలంకరణ, పరిశుభ్రత, మిషన్ భగీరథ త్రాగునీరు, టాయిలెట్స్ అన్ని పనులు  పూర్తి అయ్యాయన్నారు.  సభకు హాజరయ్యే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎస్పీ పంకజ్ పరితోష్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, ఆర్డీవోలు,జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులుపాల్గొన్నారు.WhatsApp Image 2025-05-22 at 3.25.43 PM

Views: 99
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి
డోర్నకల్ : యువత రాజకీయాల్లోకి రావాలన్న  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి ప్రజలకు సేవ చేసేందుకు  డోర్నకల్ మున్సిపల్ ఎన్నికల్లో...
మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి
మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో  ఘనంగా పరాక్రమ్ దివాస్
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ మంథని శివ యాదవ్. 
గీత కార్మిక సొసైటీ అధ్యక్షుడిగా నక్క శివలింగం ఏకగ్రీవ ఎన్నిక..
అన్ని వసతులతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు..
త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆర్రైవ్, అలైవ్