సీఎం పర్యటన కై సిద్ధమైన ఏర్పాట్లు.

సీఎం కు ఘనంగా స్వాగతం పలుకుదాం - మంత్రి దామోదర్ రాజనర్సింహ

On
సీఎం పర్యటన కై  సిద్ధమైన ఏర్పాట్లు.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 22, న్యూస్ ఇండియా : ఈనెల 23 న సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి అయినట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు  సురేష్ కుమార్ షట్కార్  ,జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, శాసనసభ్యులు సంజీవరెడ్డి  తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. హెలిపాడ్ ను,సీఎం చేతుల మీదుగా ప్రారంభించే బసవేశ్వర విగ్రహం, నిమ్జ్ రోడ్, కేంద్రీయ విద్యాలయ భవనం,సభ స్థలంను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హెలిప్యాడ్ పనులు, ప్రజా వేదిక సభ వేదిక, వి ఐ పి గ్యాలరీ, మీడియా గ్యాలరీ ,వాహనాల పార్కింగ్ పనులు, రూట్ల వారీగా ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రణాళిక వివరాలు, గ్రీనరీ, స్టేజి ఏర్పాట్లు, స్టేజి అలంకరణ, పరిశుభ్రత, మిషన్ భగీరథ త్రాగునీరు, టాయిలెట్స్ అన్ని పనులు  పూర్తి అయ్యాయన్నారు.  సభకు హాజరయ్యే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎస్పీ పంకజ్ పరితోష్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, ఆర్డీవోలు,జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులుపాల్గొన్నారు.WhatsApp Image 2025-05-22 at 3.25.43 PM

Views: 94
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, కోర్టు డ్యూటి అధికారులతో కో-ఆర్డినేషన్ మీటింగ్. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, కోర్టు డ్యూటి అధికారులతో కో-ఆర్డినేషన్ మీటింగ్.
వీలైనన్ని ఎక్కువ కేసులలో దోషులకు శిక్ష పడేలా చూడాలి. మర్డర్, పోక్సో, అత్యాచార మరియు మాదక ద్రవ్యాల కేసులలో దోషులు తప్పించుకోవడానికి వీలులేదు. చట్టం ముందు దోషులకు...
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించడమే లక్ష్యం...
జహీరాబాద్ పర్యటనలో ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత.... మంత్రి తుమ్మల.
సీఎం పర్యటన కై సిద్ధమైన ఏర్పాట్లు.
పెద్దకడుబూరు మండలం : " దొరికిన దొంగలు - పట్టుకున్న ఎస్ ఐ నిరంజన్ రెడ్డి "....!
సకాలంలో గా ‘సీఎం పర్యటన’ ఏర్పాట్లు పూర్తి చేయాలి.