నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత.... మంత్రి తుమ్మల.

ఖమ్మం 2వ డివిజన్ పాండురంగాపురంలో స్టార్మ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల

On
నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత.... మంత్రి తుమ్మల.

అభివృద్ధిలో ముందంజలో ఉన్న ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యతని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

శుక్రవారం మంత్రి, మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 2వ డివిజన్ లోని పాండురంగాపురంలో పర్యటించి కోటి రూపాయలతో నిర్మించనున్న స్టార్మ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా *మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ* పాండురంగాపురం ఖమ్మం నగరానికి దూరంగా ఉండేదని, నేడు కాలక్రమేణా అభివృద్ధి చెంది నగరంలో కలిసిపోయిందని అన్నారు.  రెండు, మూడవ డివిజన్ లో అవసరమైన అభివృద్ధి పనులు ప్రణాళిక ప్రకారం చేపట్టాలని అన్నారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్ల, రాజీవ్ యువ వికాసం వంటి పథకాలను అమలు చేయాలని అన్నారు. రోడ్డు వెడల్పు, డ్రైయిన్ నిర్మాణం వంటి అభివృద్ధి పనులు ప్రజలను ఒప్పించి చేయని పక్షంలో నగరవాసులు వరదల సమయంలో మరొకసారి ఇబ్బందులకు గురవుతారని మంత్రి తెలిపారు. 50 సంవత్సరాల కాలం ఖమ్మం నగరం అభివృద్ధిని అంచనా వేస్తూ అవసరమైన త్రాగునీరు, రోడ్లు, ఇతర మౌళిక వసతులు కల్పన చేయాలని అన్నారు. వర్షాకాలం రానున్న నేపథ్యంలో మురికి కాల్వలను శుభ్రం చేయాలని అన్నారు.  పాండురంగాపురం ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుతూ, మొక్కలు పెంచుకుంటే మనకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు మంచి ఆరోగ్యం లభిస్తుందని అన్నారు. ప్రజలను ఒప్పించి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, స్థానిక కార్పొరేటర్, ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ  ఆటంకాలను అధిగమించాలని అన్నారు. డ్రైయిన్ నిర్మాణ పనులకు వెంటనే పెగ్ మార్కింగ్ చేయాలని అన్నారు  ప్రభుత్వ భూములు ఆక్రమణ గురి కాకుండా చూడాలని అన్నారు. నగరంలో మంజూరు చేసిన అభివృద్ధి పనులు గ్రౌండింగ్ కావాలని,  ప్రభుత్వం విడుదల చేసే నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, త్రాగునీటి సరఫరా కోసం మరో 220 కోట్లను ప్రభుత్వం  మంజూరు చేస్తుందని అన్నారు. ఖమ్మం నగరానికి చుట్టు పక్కల జాతీయ రహదారులు వచ్చాయని, రైల్వే కనెక్టివిటీ ఉందని, మంచి వైద్య సదుపాయాలు, విద్యా సంస్థలు ఏర్పడ్డాయని, వైద్య కళాశాల, స్టేడియం నిర్మాణం జరుగుతున్నాయని అన్నారు.  నగరం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రశాంతంగా, పరిశుభ్రంగా ఉంచే బాధ్యత అందరిపై ఉందని అన్నారు. మతాలు, కులాల మధ్య గొడవలు పెట్టి పబ్బం గడుపుకోవాలి అనుకునే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి తెలిపారు. ప్రజలంతా సోదరుల్లా కలిసి ఉంటేనే ఆనందంగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డిసిసిబి చైర్మన్ దొండపాటి వెంకటేశ్వర రావు, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం ఆర్డిఓ నరసింహారావు, కార్పోరేటర్ లు మలీదు వెంకటేశ్వర్లు, కమర్తపు మురళి, సైదులు, దుద్దుకురి వెంకటేశ్వర్లు, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, మునిసిపల్ ఇఇ కృష్ణలాల్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Views: 6
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News