మాచన" కు రాష్ట్రపతి అభినందన..
పొగాకు నియంత్రణ పై రాష్ట్రపతి భవన్ స్పందన..
"మాచన" కు రాష్ట్రపతి అభినందన
పొగాకు నియంత్రణ పై రాష్ట్రపతి భవన్ స్పందన
హైదరాబాద్, మే 14, న్యూస్ ఇండియా ప్రతినిధి: జనహితం కోరుతూ..ఓ అధికారి రాసిన లేఖ కు రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారు. వివరాల్లోకి వెళ్తే..పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ గా పని చేస్తున్న మాచన రఘునందన్ 22 ఏళ్లుగా పొగాకు నియంత్రణకు అసాధారణ కృషి చేస్తున్నారు. కాగా మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పొగాకు నియంత్రణ ఆవశ్యకత వివరిస్తూ .. రఘునందన్ రాష్ట్రపతి కి "ప్రార్థన"లేఖ రాశారు. దేశంలో భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి. ఆయా పాఠశాలలు, కళాశాలల వద్ద దయచేసి సిగరెట్, బీడీ, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తుల విక్రయాన్ని నిషేధించండి అంటూ ఈ మెయిల్ చేయడంతో పాటు, రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్ సైట్ లో ప్రార్ధన ను సమర్పించారు. ఈ విజ్ఞప్తి కి రాష్ట్రపతి భవన్ సానుకులంగా స్పందించింది. ఈ మేరకు తనకు ఈ మెయిల్ ద్వారా ప్రత్యుత్తరం పంపారని మాచన రఘునందన్ వెల్లడించారు. ఏప్రిల్ 29 న బస్ ప్రమాదంలో గాయపడిన సందర్భంగా.. స్వస్థత లేనప్పటికీ ప్రజా హితం కోరుతూ.. రాష్టపతి కి ఈ మెయిల్ ద్వారా.. పొగాకు నియంత్రణ ఆవశ్యకతను సవివరంగా రాష్ట్రపతి భవన్ కు వివరించినట్టు "మాచన" చెప్పారు. కాగా.. విద్యార్థులుగా ఉన్నపుడే యువత ను చెడు అలవాట్లకు గురి కాకుండా చూడాల్సిన అవసరం ఉందని, తమ పిల్లల్ని లక్షలు వెచ్చించి చదువు"కొనే"లా చేస్తున్న తల్లి దండ్రులు.. వారు స్కూల్, కాలేజీ ల వద్ద ఏ దురలవాట్లకు "గురి" అవుతున్నా..రో అంతగా పట్టించుకోక పోవడంతో పాటు. అడిగినంత పాకెట్ మనీ ఇచ్చి , చెడు అలవాట్లకు ఆజ్యం పోసిన వారు అవుతున్నారని రఘునందన్ అవేదన వ్యక్తం చేస్తూ.. భారత రాష్ట్రపతి కి 42 పేజీల, వివిధ దిన పత్రికల వార్తలను కూర్చి రాష్ట్రపతి భవన్ కు రిజిస్టర్డ్ పోస్ట్ కూడా చేశారు. దీంతో మంగళవారం రాత్రి. రాష్ట్రపతి భవన్ సానుకులంగా స్పందించింది. పొగాకు నియంత్రణలో మాచన ప్రార్థనను పరిశీలించి నట్టు..సదరు సూచన ను కామర్స్ విభాగానికి, ఆరోగ్య శాఖలకు ఈ విషయాన్ని ప్రాధాన్యతతో పరిశీలించి తగు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ.. ఆయా శాఖ

లను ఆదేశించినట్టు ఈ మేయిల్ ద్వారా "మాచన' కు తెలియపరిచారు.
Comment List