సకాలంలో గా ‘సీఎం పర్యటన’ ఏర్పాట్లు పూర్తి చేయాలి.
- టెలి కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 21, న్యూస్ ఇండియా : ఈనెల 23 న సీఎం పర్యటన ఏర్పాట్లను రేపటిలోగా పూర్తి చేయాలని టెలికాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం టెలి కాన్ఫరెన్స్ లో అధికారులతో మాట్లాడుతూ...హెలిప్యాడ్ పనులు, ప్రజా వేదిక సభ ఏర్పాటు ఎంతవరకు వచ్చాయో అని అడిగి తెలుసుకున్నారు. హెలిపాడ్ నుండి స్తభాస్తలి వేదిక వరకు రోడ్డు పనులు పూర్తి చేయాలన్నారు. వాహనాల పార్కింగ్ పనులు, రూట్ల వారీగా ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రణాళిక వివరాలు, గ్రీనరీ, స్టేజి ఏర్పాట్లు, స్టేజి అలంకరణ, పరిశుభ్రత, మిషన్ భగీరథ త్రాగునీరు, టాయిలెట్స్, సభకు హాజరయ్యే ప్రజల కు సదుపాయాలు అన్ని రేపటిలోగా పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, ఆర్డీవోలు,జిల్లా అధికారులు పాల్గొన్నారు.
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List