రీజినల్ రింగ్ రోడ్ (అర్.అర్.అర్) విస్తరణ పనుల వేగవంతం చేయాలి.

రీజినల్ రింగ్ రోడ్ కు భూములు ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లింపులు ప్రామాణికంగా ఉండాలి... జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.

On
రీజినల్ రింగ్ రోడ్ (అర్.అర్.అర్) విస్తరణ పనుల వేగవంతం చేయాలి.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 15, న్యూస్ ఇండియా : రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్ (అర్.అర్.అర్) విస్తరణ పనుల ప్రగతిని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో భూసేకరణకు సంబంధించిన అంశాలపై గురువారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. భూములు అందించిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి అని కలెక్టర్ స్పష్టంగా పేర్కొన్నారు. నష్టపరిహారం చెల్లింపుల్లో పారదర్శకత పాటించాలని, ప్రతి రైతుకు న్యాయం జరగాలని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  ప్రతి గ్రామంలో భూసేకరణకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉండాలి. ప్రాజెక్టు ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన అవసరం అన్నారు. సర్వే ప్రక్రియ నుంచి పరిహార చెల్లింపుల వరకు ప్రతీ దశలో అధికారుల బాధ్యత అన్నారు.రైతుల నుండి స్వచ్ఛందంగా భూములు సేకరించేలా అవగాహన కల్పించాలన్నారు.పరిహారం చెల్లింపులు ప్రామాణికంగా ఉండాలన్నారు. భూములను అందించిన  రైతులకు న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. రైతుల భూమికి తగినంత నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాస్తవిక మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం నిర్ణయించాలన్నారు. అదనపు కలెక్టర్లు, ఆర్‌డీఓలు సమావేశంలో మాట్లాడారు. కొన్ని ప్రాంతాల్లో భూసేకరణకు సంబంధించి రైతుల్లో అభిప్రాయ బేధాలు, సర్వేలో సాంకేతిక సమస్యలు, స్థానిక స్థాయిలో అవగాహన లోపం వంటి అంశాలు ఉన్నాయని తెలియజేశారు. ఈ రహదారి పూర్తయితే హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలతో వేగవంతమైన అనుసంధానం ఏర్పడుతుందని. వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధికి  మేలు  చేస్తుందని  తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు సాగాలంటే అధికారులు నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో  రెజినల్ అధికారి శివశంకర్,  యాదాద్రి భువనగిరి జిల్లా అధికారులు, ఉమ్మడి జిల్లా అదనపు కలెక్టర్లు, ఆర్‌డీఓలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-05-15 at 4.50.44 PM

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రీజినల్ రింగ్ రోడ్ (అర్.అర్.అర్) విస్తరణ పనుల వేగవంతం చేయాలి. రీజినల్ రింగ్ రోడ్ (అర్.అర్.అర్) విస్తరణ పనుల వేగవంతం చేయాలి.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 15, న్యూస్ ఇండియా : రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్ (అర్.అర్.అర్) విస్తరణ పనుల ప్రగతిని...
టెక్నికల్ సిబ్బందికి వివిధ వర్టికల్ విభాలపై నైపుణ్యత గురించి ఒక్కరోజు శిక్షణ తరగతులు.
చికెన్ బిర్యానిలో బల్లి..
మాచన" కు రాష్ట్రపతి అభినందన..
నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ మండల పరిధిలోని టి యు డబ్ల్యూ జే ఎన్నికలు ఏకగ్రీవం
ఘనంగా 15వ వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవం..
సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించిన: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..