జిల్లాలో బాలికల, విద్యార్థినిల, మహిళల కు ‘సంగారెడ్డి జిల్లా పోలీసు షీ-టీమ్స్ రక్షణ’.

మహిళలు ఎలాంటి వేధింపులకు గురైనా జిల్లా షీ-టీమ్స్ 8712656772కు సమాచారం ఇవ్వండి. మహిళలు మౌనం వీడి, నిర్భయంగా ఫిర్యాదు చేయండి, వేధింపుల నుండి బయటపడండి. జిల్లా షీ-టీం బృందాలతో సమీక్షా : జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

On
జిల్లాలో బాలికల, విద్యార్థినిల, మహిళల కు ‘సంగారెడ్డి జిల్లా పోలీసు షీ-టీమ్స్ రక్షణ’.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 10, న్యూస్ ఇండియా : సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సబ్-డివిజన్ల వారీగా షీ టీమ్స్ బృందాలు ఉన్నాయని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, స్కూల్స్, కళాశాలు మరియు బస్ స్టాండ్ వంటి తదితర రద్దీ ప్రాంతాలలో గస్తీ కాస్తూ.. ఆకతాయిలకు చెక్ పెట్టడం జరుగుతుంది జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో షీ టీం బృందాలతో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... షీ-టీమ్ కంప్లైంట్స్ ‘క్యూఅర్ కోడ్’ స్కానర్ గురించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ ‘క్యూఅర్ కోడ్’ కోడ్ ను వినియోగించి, ఆన్లైన్ ద్వారా ఎక్కడి నుండైన పిర్యాదు చేసేందుకు అనుకూలంగా ఉంటుంది అన్నారు. ఈ షీ-టీమ్ కంప్లైంట్ ‘క్యూఅర్ కోడ్’ స్కానర్ పోస్టర్లను జిల్లాలోని బస్సులలో, బస్ స్టాండ్ లలో, సినిమా హల్లు, స్కూల్స్, కళాశాలలు, ఇతర రద్దీ ప్రాంతాలలో అతికించబడి ఉంటాయని ఎవరైనా మహిళలు వేధింపులకు గురైనట్లైతే ఈ ‘క్యూఅర్ కోడ్’ ను స్కాన్ చేయడం ద్వారా లింక్ లో గాని ఫిర్యాది పేరు, లొకేషన్ తదితర వివరాలను పూరించి సబ్మిట్ చేయగానే షీ-టీమ్ విభాగానికి చేరుతుంది. తద్వారా త్వరిత గతిన స్పందహించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో మహిళలు ఎలాంటి వేధింపులకు గురైన జిల్లా షీ-టీం నెంబర్ 8712656772 కు కాల్ చేసి గాని, వాట్స్ ఆప్ ద్వారా గాని, ‘క్యూఅర్ కోడ్’ స్కాన్ చేసి గాని ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. ఫిర్యాది వివరాలు గోప్యంగా ఉంచబడతాయని మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలసిందిగా జిల్లా ఎస్పీ సూచించారు.WhatsApp Image 2025-05-10 at 5.27.46 PM

Views: 1
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సమాజ హిత "విజయ"గర్వం... సమాజ హిత "విజయ"గర్వం...
సమాజ హిత "విజయ"గర్వం  సమాజ హితం కోరే సైనికుడు నా కొడుకు:మాచన విజయ  సమాజ హితం కోరే సైనికుడు  నా కొడుకు:మాచన విజయ.. మే రెండవ ఆదివారం(ప్రపంచ...
జిల్లాలో బాలికల, విద్యార్థినిల, మహిళల కు ‘సంగారెడ్డి జిల్లా పోలీసు షీ-టీమ్స్ రక్షణ’.
నిందితులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే, ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.
ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు