మాచన" కు రాష్ట్రపతి భవన్ ఫోన్..

హలో.. యే..రఘునందన్ మాచన హై?! హమ్ రాష్ట్రపతి భవన్ సే బాత్ కర్ రహే హై..

On
మాచన

"మాచన" కు రాష్ట్రపతి భవన్ ఫోన్

హలో.. యే..రఘునందన్ మాచన హై?!
హమ్ రాష్ట్రపతి భవన్ సే బాత్ కర్ రహే హై..

IMG-20250312-WA0599(1)
పొగాకు నియంత్రణకు కృషి చేసిన మార్చిన రఘునందన్..

హైదరాబాద్, మే 20, న్యూస్ ఇండియా ప్రతినిధి: అంటూ.. తనకు భారత రాష్ట్రపతి కార్యాలయ వర్గాలు ఫోన్ చేసి,పొగాకు నియంత్రణ కృషి ని రాష్ట్రపతి తరపున అభినందిస్తూ.. ఫోన్ చేశారని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్, పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్ స్పష్టం చేశారు.మంగళవారం ఆయన పద్మశాలి భవన్ వద్ద మాట్లాడుతూ..తన 22 ఏళ్ళ పొగాకు నియంత్రణ కృషి ని..ఇటీవలే రాష్ట్రపతి భవన్ కు అటు ఇ మెయిల్ ద్వారా..ఇటు వెబ్ సైట్ లో ఉన్న "ప్రార్ధన" పత్రం ద్వారా ..పొగాకు నియంత్రణ కృషి ని సవివరంగా.. వివరించినట్టు "మాచన" వెల్లడించారు.మంగళవారం ఉదయం 10 నుంచి 12 30 మధ్య మూడు మార్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు ఫోన్ చేశారని రఘునందన్ చెప్పారు.
జన హితం కోరుతూ. రాష్ట్రపతి కి రాసిన లేఖ కు, రాష్ట్రపతి భవన్ అధికారులు సానుకూలంగా స్పందించి   ఫోన్ చేసి మరీ విషయాన్ని వివరించడం తో..తన జన్మ ధన్యం అయ్యిందని మాచన రఘునందన్ హర్షం వ్యక్తం చేశారు.42 పేజీల తో కూడిన 22 ఏళ్ల పొగాకు నియంత్రణ అసాధారణ కృషి తాలూకు కాపిలను రాష్ట్రపతి భవన్ కు పోస్ట్ ద్వారా పంపినట్టు తెలిపారు. కాగా మే 31 ,ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా..రఘునందన్ రాష్ట్రపతి కి పొగాకు నియంత్రణ ఆవశ్యకత వివరిస్తూ..రాష్ట్రపతి భవన్ వెబ్ సైట్ లో లేఖ సమర్పించారు. దేశం భావి భారత పౌరులను తీర్చి దిద్దే ఎన్నో విద్యా సంస్థలు, కళాశాలల వద్ద సిగరెట్,బీడీ గుట్కా వంటి పొగాకు ఉత్పత్తుల విక్రయాన్ని నిషేధించాలి అంటూ మేయిల్ చేయడం తో పాటు, అధికారిక వెబ్ సైట్ లో ప్రార్ధన ను సమర్పించారు.ఈ విజ్ఞప్తి కి రాష్ట్రపతి భవన్ ఇదివరకే సానుకులంగా స్పందించిందని.ఇ మెయిల్ ద్వారా ప్రత్యుత్తరం కూడా పంపారని మాచన రఘునందన్ వెల్లడించారు.ప్రజా హితం కోరుతూ..పొగాకు నియంత్రణ ఆవశ్యకత ను రాష్ట్రపతి కి వివరించినట్టు "మాచన" చెప్పారు.విద్యార్థులు గా ఉన్నపుడే యువత ను చెడు అలవాట్లకు గురి కాకుండా చూడాల్సిన అవసరం ఉందని, తమ పిల్లల్ని లక్షలు వెచ్చించి చదువు"కొనే"లా చేస్తున్న తల్లి దండ్రులు..వారు స్కూల్ ,కాలేజీ ల వద్ద ఏ దురలవాట్లకు "గురి" అవుతున్నా..రో అంతగా పట్టించుకోక పోవడం తో పాటు. అడిగినంత పాకెట్ మనీ ఇచ్చి ,చెడు అలవాట్లకు ఆజ్యం పోసిన వారు అవుతున్నారని రఘునందన్ అవేదన వ్యక్తం చేస్తూ..రాష్ట్రపతి కి 42 పేజీల నివేదిక  రాష్ట్రపతి భవన్ కు రిజిస్టర్డ్ పోస్ట్ చేశారు.

Views: 18

About The Author

Post Comment

Comment List

Latest News