కాలనీవాసుల కోరిక మేరకు ఎల్లమ్మ గుడికి విరాళం

అనుమండ్ల మాధవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

కాలనీవాసుల కోరిక మేరకు ఎల్లమ్మ గుడికి విరాళం

చెర్లపాలెం గ్రామానికి మరో శుభవార్త

గత కొద్ది రోజుల క్రితం కాలనీవాసుల కోరిక మేరకు ఎల్లమ్మ గుడికి విరాళం

ప్రస్తుతం చర్లపాలెంలో ముత్యాలమ్మ గుడి పునర్నిర్మాణం

 అనుమండ్ల మాధవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలుIMG-20250813-WA0034

Read More విద్య, వైద్య విషయంలో ఎల్లపుడు జిల్లా నాయకత్వం అందుబాటులో ఉంటుంది*

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామంలోని ముత్యాలమ్మ గుడి పునర్నిర్మాణానికి అనుమండ్ల మాధవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చింది. గత కొన్నేళ్లుగా శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని కొత్తగా నిర్మించేందుకు అవసరమైన మొత్తాన్ని ట్రస్ట్ భరిస్తుందని తోరూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమండ్ల తిరుపతిరెడ్డి తెలిపారు. బోనాల పండుగ సందర్భంగా గ్రామాన్ని సందర్శించిన ఆయన, ముత్యాలమ్మ గుడి నిర్మాణం త్వరలో ప్రారంబించి గ్రామస్తుల ఆశయాన్ని నెరవేర్చడమే మా లక్ష్యం అని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ...ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు, గ్రామ ప్రజల ఏకతతో ఈ పనులు వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది బోనాల పండుగకు ముందే గుడి నిర్మాణం పూర్తి చేసి, కొత్త గుడికి భక్తులు దర్శనానికి సిద్ధం కావాలని మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతి రెడ్డి అన్నారు.ఈ వార్త తెలిసిన వెంటనే పెద్దలు, మహిళలు, యువతీ,యువకులు తిరుపతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బోనాల సందర్భంగా తల్లిని దర్శించుకున్న భక్తులు మాట్లాడుతూ...మా బాల్యం నుండి ఉన్న కల ఇప్పుడు నెరవేరబోతోంది. మా తరాలవారు కొత్త గుడిలో తల్లిని దర్శించుకునే రోజు దగ్గరలోనే ఉంది అని తెలిపారు.ముత్యాలమ్మ గుడి కేవలం ఆరాధన స్థలం మాత్రమే కాదు, గ్రామ ఏకతకు ప్రతీక,పునర్నిర్మాణం పూర్తయిన  రోజు చెర్లపాలెం చరిత్రలో బంగారు అక్షరాల్లో నిలిచిపోనుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Read More ప్రజలందరు అప్రమత్తం వుండాలి...

Views: 36
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

బీహార్ తుపాకుల విక్రయ ముఠా కీలక వ్యక్తి అరెస్ట్... బీహార్ తుపాకుల విక్రయ ముఠా కీలక వ్యక్తి అరెస్ట్...
బీహార్ తుపాకుల విక్రయ ముఠా కీలక వ్యక్తి అరెస్ట్... శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలి... రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు.. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న...
జిల్లా యంత్రాంగం సూచనలను పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ 
‘భారీ భూ-కుంభకోణాన్ని' గాలికొదిలేసిన జిల్లా కలెక్టర్!
మహేశ్వరంలో ‘నషాముక్త్ భారత్ అభియాన్'..
భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,
కాలనీవాసుల కోరిక మేరకు ఎల్లమ్మ గుడికి విరాళం
ఆగస్టు 14 నుంచి 5 రోజుల పాటు 10 రైళ్లు రద్దు!