బీహార్ తుపాకుల విక్రయ ముఠా కీలక వ్యక్తి అరెస్ట్...

రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు..

On
బీహార్ తుపాకుల విక్రయ ముఠా కీలక వ్యక్తి అరెస్ట్...

బీహార్ తుపాకుల విక్రయ ముఠా కీలక వ్యక్తి అరెస్ట్...

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలి...

రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు..

IMG-20250814-WA1065
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న రాచకొండ కమిషనర్ జి. సుధీర్ బాబు..

ఎల్బీనగర్, ఆగస్టు 14, న్యూస్ ఇండియా ప్రతినిధి:

Read More ప్రజలందరు అప్రమత్తం వుండాలి...

బీహార్ కు చెందిన తుపాకుల విక్రయ ముఠాకు చెందిన కీలక వ్యక్తిని రాచకొండ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. చర్లపల్లి పోలీసులు, మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ లో అంతర్ రాష్ట్ర ఆయుధ విక్రయ ముఠా నాయకుడు పట్టుబడ్డారు. ఈ ఘటనలో బీహార్ కు చెందిన శివకుమార్ (32) అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు మీడియాకు వివరించారు. ఈ ముఠాలో మరో సభ్యుడైన బీహార్ కు చెందిన కృష్ణ పాశ్వాన్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు చెప్పారు. అరెస్ట్ చేసిన నిందితుని నుంచి మూడు దేశవాలీ తుపాకులను, 10 తూటాలను, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బీహార్ కు చెందిన శివకుమార్ హైదరాబాద్ లోని మేడిపల్లి లో గల ఓ ఎరువుల కంపెనీలో హమాలీగా పనిచేస్తూ ఆయుధాలు తయారు చేసి, హైదరాబాద్ లో విక్రయించి సులభంగా డబ్బు సంపాదించడానికి పథక రచన చేశాడన్నారు. తన బావమరిది కృష్ణ పాశ్వాన్ తో కలిసి శివకుమార్ ఆయుధాల విక్రయానికి పథక రచన చేశాడని, ఇతను గతంలో నేర చరిత్రను కలిగి ఉన్నట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు. ఇటీవల రాఖీ పండుగకు బీహార్ వెళ్లిన శివకుమార్ అక్కడి నుంచి ఆయుధాలను తీసుకువచ్చి అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా, విశ్వసనీయ సమాచారం మేరకు అరెస్ట్ చేశామన్నారు. అక్రమంగా ఆయుధాలను కలిగి ఉండడం తీవ్ర నేరమని, ఇటువంటి వ్యక్తుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పోలీసులకు సమాచారం అందించి శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని సుధీర్ బాబు ఈ సందర్భంగా కోరారు.

Read More మహేశ్వరంలో ‘నషాముక్త్ భారత్ అభియాన్'..

Views: 0

About The Author

Post Comment

Comment List

Latest News

బీహార్ తుపాకుల విక్రయ ముఠా కీలక వ్యక్తి అరెస్ట్... బీహార్ తుపాకుల విక్రయ ముఠా కీలక వ్యక్తి అరెస్ట్...
బీహార్ తుపాకుల విక్రయ ముఠా కీలక వ్యక్తి అరెస్ట్... శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలి... రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు.. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న...
జిల్లా యంత్రాంగం సూచనలను పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ 
‘భారీ భూ-కుంభకోణాన్ని' గాలికొదిలేసిన జిల్లా కలెక్టర్!
మహేశ్వరంలో ‘నషాముక్త్ భారత్ అభియాన్'..
భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,
కాలనీవాసుల కోరిక మేరకు ఎల్లమ్మ గుడికి విరాళం
ఆగస్టు 14 నుంచి 5 రోజుల పాటు 10 రైళ్లు రద్దు!