*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
*జర్నలిస్టులకు మిత్రులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా*
*టి యు డబ్ల్యూ జే ఐ జే యు సభ్యులకు కోసం నిరంతరం పోరాడుతా రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్*
*సన్మాన కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు శ్రీనివాసులు*
*న్యూస్ ఇండియా శ్రీరంగాపూర్*
పెబ్బేరు ఉమ్మడి మండలాలలో 37 సంవత్సరాలుగా పాత్రికేయ వృత్తిలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న ఎన్. శ్రీనివాసులు,
1988 సంవత్సరంలో తన పాత్రికేయ వృత్తి ఎంచుకొని,ఉదయించే సూర్యుడిలా "ఉదయం" పేపర్ లో కలమే ఆయుధంగా ప్రయాణం మొదలు పెట్టి.ఆంధ్ర "ప్రభ" లో ప్రబోధించే పాత్రికేయుడిగా కాంతిని వెలిగించి.వాస్తవాలను వ్రాసే వార్త శీనన్న"గా విరాజిల్లి..రాష్ట్ర ఆత్మగౌరవ పత్రిక లో అందరిని ఆప్యాయంగా పలకరించే నమస్తే శీనన్నగా నడుస్తూ...శ్వాస ఉన్నంతవరకు 'కలం' వదిలిపెట్టని విక్రమార్కుడిలా.నాడు వార్తాశీనన్నగా...
నేడు నమస్తేశీనన్నగా..యువ జర్నలిస్టులకు మార్గదర్శకంగా ఉంటూ...అందరి మనోభావాలను గౌరవిస్తూ... ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులుగా..మా వెన్నంటూ ఉంటూ- పాత్రికేయ విలువలను కాపాడుతూ...సలహాలు సూచనలు ఇస్తూ కలంతో ప్రజలు గళం విప్పేలా కథనాలు ఎన్నో రాస్తూ
పాత్రికేయ వృత్తికే... జీవితం అంకితం చేసిన మా 37 సంవత్సరాల సీనియర్ పాత్రికేయులు "వార్తా-శీనన్న"కు టియుడబ్ల్యూజె ఐజేయు కు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన శుభ సందర్భంగా పెబ్బేర్ ప్రెస్ క్లబ్ సభ్యులు ఏర్పాటు చేసిన సన్మాన సభకు టియుడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కార్యదర్శి జి.మధు గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైనందున నారాయణదాస్. శ్రీనివాసులు కు రాష్ట్ర కమిటీ,జిల్లా అధ్యక్షులు మాధవరావు, ప్రధాన కార్యదర్శి రాజు, సీనియర్ పాత్రికేయులు బాలస్వామి, ప్రశాంత్, జిల్లా కోశాధికారి మన్యం, నియోజకవర్గ అధ్యక్షులు విజయకుమార్, ప్రధాన కార్యదర్శి పి.బాలారాజు,ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జి.బాలవర్ధన్,ప్రధాన కార్యదర్శి పరశురాం, ఉపాధ్యక్షులు పూజారి గోపి,ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా మెమొంట్ తో సన్మానించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్రీనివాసులు మాట్లాడుతూ ఇచ్చిన పదవిని బాధ్యతగా నిర్వహిస్తానని, జర్నలిస్టుల సమస్యలకు ముందుండి పోరాడుతానని, దేశంలోనే పెద్ద యూనియన్ లో (TUWJ- IJU) రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎన్నిక చేసిన రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెబ్బేర్, శ్రీరంగాపూర్ పాత్రికేయులు పాల్గొన్నారు.
Comment List