దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..!
డయాగ్నిస్టిక్ సెంటర్ల ముసుగులో డాక్టర్ల మాయ మాయజాలం..
దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..!
నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ల చెక్ టెస్టులు..
డయాగ్నిస్టిక్ సెంటర్ల ముసుగులో డాక్టర్ల మాయ మాయజాలం..
కార్పొరేట్ ఆసుపత్రిని తలపిస్తున్న వైనం..
రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, సెప్టెంబర్ 17, న్యూస్ ఇండియా ప్రతినిధి:

నగరంలో విజయ డయాగ్నిక్ సెంటర్ లీలలు ఎవరికి అంత చిక్కడం లేదు. కార్పొరేట్ ఆసుపత్రికి తలపిస్తూ పరీక్షలకు వచ్చే రోగులను ఇక్కడ డాక్టర్ల పేరుతో మాయజాలం చేస్తున్నారు. కేవలం డయాగ్నిక్ సెంటర్ అంటేనే పరీక్షల నిమిత్తం ఏర్పాటు చేసిన కేంద్రం. కానీ నగరంలోని అనేక విజయ డయాగ్నిక్ సెంటర్లలో డాక్టర్ల పేరుతో అమాయక ప్రజల ఆరోగ్యాన్ని ఆసరా చేసుకుని అందిన కాడికి దండుకుంటున్నారు. దీనిపై పర్యవేక్షించాల్సిన వైద్యశాఖ అధికారులు ముడుపుల మత్తులో జరుగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దిల్ సుఖ్ నగర్ లోని విజయ డయాగ్నిక్ సెంటర్ ఎందుకు ఉదాహరణ. ఇక్కడ డి ఎం అండ్ హెచ్ ఓ పర్యవేక్షణ ఉండదు. పరీక్ష పేరుతో వందల వేలు అమాయక ప్రజల నుంచి దోచుకుంటారు. అంతేకాకుండా డాక్టర్లను కూడా నియమించి వారి సూచించిన పరీక్షలను వేలకు వేలు దొరుకుతూ చేస్తుంటారు. వారికి అసలు అర్హత ఉందా కూడా పట్టించుకునే పాపన్న పోరు. కనీసం సరైన పరీక్షలు చేస్తారంటే అది కూడా జరగడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ కార్పొరేట్ వ్యవస్థ కావడంతో దీనిపై ఎవరు దృష్టి సారించడం లేదు. అధికారులకు తెలిసిన వారికి అందాల్సిన ముడుపులు అందడంతో అంత గప్చి అన్నట్టు వ్యవహారం సాగుతోంది అనే విమర్శలు ఉన్నాయి. వీటిపై ఒకసారి ప్రభుత్వం, రాష్ట్ర వైద్యశాఖ దృష్టి సారించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Comment List