బండి యాత్ర షురూ!

On

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను హైకోర్టు ఇచ్చిన షరతులకు లోబడి ప్రారంభించారు. నిన్న కరీంనగర్‌ నుంచి నిర్మల్‌కు చేరుకున్న బండి సంజయ్‌.. సారంగాపూర్ మండలం అడెల్లి పోచమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసి ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రను ప్రారంభించారు. దీంతో బీజేపీ శ్రేణుల్లో నయా జోష్‌ నెలకొంది. మరోవైపు భైంసా శివారులో నేడు బీజేపీ బహిరంగ సభ జరగనుంది. నిర్మల్ నేషనల్ హైవే పక్కన ఉన్న […]

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను హైకోర్టు ఇచ్చిన షరతులకు లోబడి ప్రారంభించారు.

నిన్న కరీంనగర్‌ నుంచి నిర్మల్‌కు చేరుకున్న బండి సంజయ్‌.. సారంగాపూర్ మండలం అడెల్లి పోచమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసి ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రను ప్రారంభించారు.

దీంతో బీజేపీ శ్రేణుల్లో నయా జోష్‌ నెలకొంది. మరోవైపు భైంసా శివారులో నేడు బీజేపీ బహిరంగ సభ జరగనుంది. నిర్మల్ నేషనల్ హైవే పక్కన ఉన్న గణేశ్ ఇండస్ట్రీ ప్రాంగణంలో సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు బీజేపీ భారీ బహిరంగ సభ ఉండటంతో నిర్మల్ జిల్లా భైంసాలో 144 సెక్షన్ అమల్లో ఉంది.

Read More జాతీయ సేవా పథక అవశ్యకత పై అవగాహన కార్యక్రమం... 

నిన్న అమల్లోకి తెచ్చిన ఈ సెక్షన్‌ను ఇవాళ కూడా అమల్లో ఉంచుతున్నారు.

Read More ఈ వింత విచిత్రమైన సంఘటన బహుశా ఎక్కడ జరగదేమో...?

ఈ కారణంగా భైంసాలో భారీగా పోలీసులు మోహరించారు. అయితే 144 సెక్షన్‌పై పోలీసులు అధికారిక ప్రకటన చెయ్యలేదు.

Read More శబ్బాష్.. మున్సిపాలిటీ

ఇవాళ బహిరంగ సభ జరగనుండటంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.

అయితే ఇది సిటీకి శివారులో జరుగుతోంది కాబట్టి.. శాంతి భద్రతలకు ఎలాంటి సమస్యా ఉండదని పోలీసులు అంటున్నారు.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News