షర్మిలకు బెయిల్..దీక్ష విరమించిన విజయమ్మ

On

తెలంగాణలో రాజకీయం మహా రంజుగా మారుతోంది. రెండ్రోజులుగా షర్మిల వర్సెస్ టీఆర్ఎస్ మధ్య జరుగుతున్న పోరు..మరో రూపు దాల్చింది. నిన్న షర్మిల వాహనంపై దాడి చేయడంతో రాజుకున్న వైరం..తాజాగా షర్మిలను అరెస్ట్ చేయడంతో మరింత ముదిరింది. అటు షర్మిల అరెస్ట్ నిరసిస్తూ విజయమ్మ దీక్ష చేపట్టారు. అయితే షర్మిలకు నాంపల్లి కోర్ట్ బెయిల్ మంజూరు చేయడంతో విజయమ్మ దీక్ష విరమించారు. షర్మిల అరెస్టుకు నిరసనగా తన ఇంటి ఆవరణలోనే విజయమ్మ దీక్ష చేపట్టారు. వ్యక్తిగతపూచీకత్తుపై బెయిల్ మంజూర్ […]

తెలంగాణలో రాజకీయం మహా రంజుగా మారుతోంది. రెండ్రోజులుగా షర్మిల వర్సెస్ టీఆర్ఎస్ మధ్య జరుగుతున్న పోరు..మరో రూపు దాల్చింది.

నిన్న షర్మిల వాహనంపై దాడి చేయడంతో రాజుకున్న వైరం..తాజాగా షర్మిలను అరెస్ట్ చేయడంతో మరింత ముదిరింది.

అటు షర్మిల అరెస్ట్ నిరసిస్తూ విజయమ్మ దీక్ష చేపట్టారు. అయితే షర్మిలకు నాంపల్లి కోర్ట్ బెయిల్ మంజూరు చేయడంతో విజయమ్మ దీక్ష విరమించారు.

షర్మిల అరెస్టుకు నిరసనగా తన ఇంటి ఆవరణలోనే విజయమ్మ దీక్ష చేపట్టారు. వ్యక్తిగతపూచీకత్తుపై బెయిల్ మంజూర్ చేశారు.
రిమాండ్ విధించాలని పోలీసులు కోరగా.. షర్మిల తరపున న్యాయవాదులు వాదించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న మేజిస్ట్రేట్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై నాంపల్లి కోర్టులో కీలక వాదనలు జరిగాయి.
శాంతిభద్రతల సమస్య వస్తుందనే షర్మిలను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు.
రోడ్డుపై షర్మిల, పార్టీ కార్యకర్తలతో న్యూసెన్స్ క్రియేట్ అయ్యిందని పోలీసులు వెల్లడించారు.
షర్మిలకు రిమాండ్ విధించకపోతే శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.
షర్మిల న్యాయవాదులు రిమాండ్‌ను వ్యతిరేకించారు. తప్పుడు కేసులు నమోదు చేశారని, జరిగిన ఘటనకు పెట్టిన కేసులకు సంబంధంలేదని వాదించారు.
ఉద్దేశ్యపూర్వకంగానే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారని పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళ్తే అరెస్ట్ చేశారని ప్రస్తావించారు. పోలీసుల విధులకు షర్మిల ఆటంకం కలిగించలేదని పేర్కన్నారు.

Read More అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....

కాగా వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై, తన కాన్వాయ్‌పై టీఆర్‌ఎస్‌ శ్రేణులు సోమవారం దాడి చేశారు.

Read More ఎర్రబెల్లి దయాకర్ రావు కి ఎదురుగాలి

ఈ దాడిని నిరసిస్తూ మంగళవారం ప్రగతి భవన్‌ ముట్టడికి వెళ్తున్న వైఎస్‌ షర్మిలను పోలీసులు అడ్డుకున్నాడు. పంజాగుట్టలో ఆమె కారును అడ్డు తగిలారు.

Read More జోరుగా జారే ప్రచారా హోరు

డోర్‌ లాక్‌ చేసుకుని షర్మిల కారు లోపలే ఉన్నారు. దీంతో కొద్దిసేపటి తర్వాత కారును క్రేన్‌తోనే లిఫ్ట్‌ చేసి ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కారులో నలుగురు వ్యక్తులు ఉండగానే లాక్కెళ్లారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్ ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ బూత్ లోకి ఓటు వేసేందుకు...
రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన