అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి

బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి..

On
అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి

కాంగ్రెస్ లో మంత్రుల మధ్య సమన్వయం లేదు

కొత్తగూడెం(న్యూస్ ఇండియా)ఫిబ్రవరి 7:కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలలో బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండని శనివారం కొత్తగూడెం మధువన్ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో బిజెపి నేషనల్ కౌన్సిల్ మెంబర్, తమిళనాడు కర్ణాటక సహా ఇంచార్జ్  పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ  420హామీలు, 6 గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసిందని, మంత్రుల మధ్య సమన్వయం లోపించింది అన్నారు. కాంగ్రెస్ లో వర్గాలు ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కొత్తగూడెం రూపు రేఖలు మారాలంటే బిజెపి రావాలన్నారు. సింగరేణిలో కుంభకోణంపై సిబిఐ, సెంట్రల్ విజిలెన్స్ తో విచారణ జరిపి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. ప్రజలందరూ బీజేపి వైపు ఉన్నారని బిజెపి విజయం తథ్యం అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రంగా కిరణ్, విజయ్ బాబు, మనోహర్, నరేందర్, రవీందర్, గొడుగు శ్రీధర్ తదితరులు  పాల్గొన్నారు.

 

Views: 82
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News