క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుంది.

On
క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుంది.

ఖమ్మం, మేరా యువ భారత్ ( మినిస్ట్రీ అఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ) వారి సహకారంతో పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దుమ్ముగూడెం మండల, ప్రభుత్వ ఆసుపత్రి మైదానం నందు బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ ఘనంగా నిర్వహించడం జరిగింది. అబ్బాయిలకు కబడ్డీ, అమ్మాయిలకు టగ్ ఆఫ్ వార్, బ్యాడ్మింటన్ (షటిల్), పరుగు వంటి క్రీడలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా సింగవరం గ్రామం సర్పంచ్ ఎస్.నరేష్ విద్యార్థులతో మాట్లాడుతూ క్రీడలు ఆడడం వల్ల జ్ఞాపకశక్తి పెంపొందించడం, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం, మరియు చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉండడం వంటి మానసిక ఉల్లాసం ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని శంకర్ అన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన  విద్యార్థులకు సర్పంచ్ చేతుల మీదుగా మొదటి మరియు ద్వితీయ బహుమతులు  షీల్డ్, మెడల్స్, సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది.

Views: 2
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News