కార్పొరేషన్లో ప్రమాణ స్వీకారం చేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు

కార్పొరేషన్ కు తండ్రి పాత్ర వహిస్తా ఎమ్మెల్యే కూనంనేని 

On
కార్పొరేషన్లో ప్రమాణ స్వీకారం చేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు

ప్రమాణ స్వీకారం చేయించిన మున్సిపల్ కమిషనర్ సుజాత

IMG20260223161402

కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి)ఫిబ్రవరి 23:కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మేయర్ మూడే గణేష్, డిప్యూటీ మేయర్ లలిత కుమారిల సమక్షంలో సోమవారం కొత్తగూడెం కార్పొరేషన్ లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన 8 మంది కార్పొరేటర్లు వేల్పుల వీరమ్మ, మల్హోత్రా సాగర్, భీమా శ్రీవల్లి, గుగులోత్ రాంబాబు, మల్లెల స్వప్న, సింధు తపస్వి, బత్తుల మధుచంద్, గుణ చరిత్ చేత మున్సిపల్ కమిషనర్ కె. సుజాత ప్రమాణ స్వీకారం జరిపించారు.

ఎంపీ వద్దిరాజు ఆధ్వర్యంలో కార్పోరేటర్లకు సన్మానం 

ప్రమాణస్వీకారన్న అనంతరం IMG20260223163516 బిఆర్ఎస్ కార్పొరేటర్లను ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో.. ఆయన సూచన మేరకు స్థానిక బిఆర్ఎస్ నేతలు ఘనంగా సన్మానించారు. 8 మంది కార్పొరేటర్లకు శాలువా కప్పి, పూల బొకే ఇచ్చి ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మేయర్ మూడ్ గణేష్ లను కూడా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్పొరేషన్ కు స్థానిక ఎమ్మెల్యేగా తండ్రి పాత్ర వహిస్తానని, అభివృద్ధిలో అందరం కలిసి ముందుకు వెళ్దామని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్, సయ్యద్ ఇస్మాయిల్, బీమా శ్రీధర్, మల్లెల రవిచంద్ర, కాంపెల్లి కనకేష్, కొట్టి వెంకటేశ్వర్లు, బొమ్మిడి రమాకాంత్, బొమ్మిడి శ్రీకాంత్, రాజేష్ (కన్ని), సంకు బాపన అనుదీప్, ముత్యాల రాజేష్, కరాటే శ్రీనివాస్ యాదవ్, బట్టు మంజల, వీరన్న, డాబా శంకర్, దుర్గాప్రసాద్, వాసుమల్ల గౌతం, మరియు కార్పొరేటర్ల కుటుంబ సభ్యులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 45
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News