ఇంటర్ ఎగ్జామ్స్.., సెంటర్ అడ్రస్ కోసం ఇలా చేయండి!
ఇంటర్ ఎగ్జామ్స్.. సెంటర్ అడ్రస్ కోసం ఇలా చేయండి!
రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 24, న్యూస్ ఇండియా ప్రతినిధి: రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యార్థులు తప్పనిసరిగా ఉదయం 8:30 గంటలలోపు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రత్యేకంగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో ట్రాఫిక్ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే బయలుదేరేలా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలి. చివరి నిమిషం హడావుడి వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. సెంటర్ అడ్రస్ తెలుసుకోవడం ఇలా.., హాల్ టికెట్‌పై ఉన్న QR కోడ్‌ను మొబైల్ ఫోన్‌తో స్కాన్ చేయండి. స్కాన్ చేసిన వెంటనే పరీక్షా కేంద్రం లొకేషన్ డైరెక్ట్‌గా మ్యాప్‌లో ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మార్గాన్ని ముందుగానే చెక్ చేసుకుని ప్రయాణ సమయాన్ని అంచనా వేసుకోండి. విద్యార్థులు హాల్ టికెట్, అవసరమైన స్టేషనరీ ముందురోజే సిద్ధం చేసుకోవడం మంచిది. ఎలక్ట్రానిక్ పరికరాలు, ముఖ్యంగా మొబైల్ ఫోన్లు పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదని గుర్తుంచుకోండి. ఇంటర్ విద్యార్థులున్న తల్లిదండ్రులకు ఈ సమాచారాన్ని తప్పక షేర్ చేయండి… ఒక చిన్న జాగ్రత్త పెద్ద ఇబ్బందిని తప్పించగలము.

Comment List