వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు

On
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం  ఏటుకూరి మునేశ్వరావు

ఖమ్మం ఫిబ్రవరి 28 ఖమ్మం న్యూస్: ఆర్‌.ఎం.పీ డాక్టర్‌గా ప్రజలకు అపార సేవలందించిన వనంవారి కృష్ణాపురం మహనీయుడు ఏటుకూరి మునేశ్వరావు పెద్ద కర్మ శనివారం రోజున జరిగింది .గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం అహర్నిశలు కష్టపడి, సేవాభావం, మానవత్వం, నిబద్ధతతో పనిచేసిన మహోన్నత వ్యక్తిని కోల్పోవడం గ్రామ ప్రజలకు తీరని లోటు. ఆయన అందించిన వైద్య సేవలు,చేసిన సహాయాలు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసాయి. గ్రామానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ,ఆయన ఆత్మ శాంతి కోసం ఫ్రీజర్‌ను(శవపేటిక) గ్రామ ప్రజలకు విరాళంగా అందించడం జరిగింది.ఈ సందర్భంగా వారి కుమార్తె సరిత భావోద్వేగంగా మాట్లాడుతూ – “మా నాన్నగారైన మునేశ్వర ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచించే మహోన్నత వ్యక్తి.ఎల్ఐసి క్లబ్ సభ్యుడిగా అనేకమందికి ఉపాధి కల్పించారు అన్నారు ఆయన లేని లోటు గ్రామంలో స్పష్టంగా కనిపిస్తుందని గ్రామానికి ఎన్నో సేవలు చేశారని అన్నారు.మా నాన్నగారు ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకురాలునీరుకొండ ఉషారాణి,తదితరులు పాల్గొని సంతాపం తెలియజేశారు.

IMG_20260228_182803IMG_20260228_182803

Views: 17
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మం ఏప్రిల్ 12 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: రాష్ట్రంలో ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో ఖమ్మం వెలాసిటీ జూనియర్ కళాశాలలో విజయకేతనం ఎగరవేసింది. కళాశాల విద్యార్థిని విద్యార్థులు స్టేట్...
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..
ఫీజు రీయింబర్స్మెంట్ పై హై కోర్టు వ్యాఖ్యలు బాధాకరం