పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

On

ఇవాళ్టి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే.. కేంద్రం అన్ని పార్టీలతో సమావేశం కూడా నిర్వహించింది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోడీ మీడియా ప్రతినిధులతో ముచ్చటించే అవకాశం ఉందని పార్లమెంట్‌ సెక్రటరీ పేర్కొన్నారు. సాధారణంగా బహిరంగ సభలు, పలు కార్యక్రమాల్లో ప్రధాని మోడీ మాట్లాడడం తరచూ జరుగుతుంటుంది. కానీ, నేరుగా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడడం చాలా అరుదు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రాధాన్యం […]

ఇవాళ్టి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

ఇప్పటికే.. కేంద్రం అన్ని పార్టీలతో సమావేశం కూడా నిర్వహించింది.

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోడీ మీడియా ప్రతినిధులతో ముచ్చటించే అవకాశం ఉందని పార్లమెంట్‌ సెక్రటరీ పేర్కొన్నారు.

సాధారణంగా బహిరంగ సభలు, పలు కార్యక్రమాల్లో ప్రధాని మోడీ మాట్లాడడం తరచూ జరుగుతుంటుంది.

Read More యుఎస్-ఇరాన్ యుద్ధంతో ఆర్థిక మాంద్యం ముప్పు... బంగారాన్ని భారీగా కొని దాచిపెట్టుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

కానీ, నేరుగా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడడం చాలా అరుదు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రాధాన్యం సంతరించుకుంది.

Read More తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రూట్‌లో కొత్త స్పెషల్ ట్రైన్స్.. ప్రయాణం మరింత సులభం!

ఇప్పటివరకు మీడియాతో చాలా సందర్భాల్లో మాట్లడని ప్రధాని మోడీ.. బుధవారం ఏం మాట్లాడనున్నారు.

Read More అప్పులు చెల్లించలేకపోతున్నారా? దివాలా పిటిషన్ అంటే ఏమిటి.. చట్టం ఏం చెబుతోంది?

. మాట్లాడితే ఎలాంటి అంశాల గురించి ప్రస్తావించనున్నారు..? మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయి..? ఎలాంటి జవాబిస్తారు.. ? అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

డిసెంబర్‌ 7 నుంచి 29 వరకు జరిగే పార్లమెంట్‌ సమావేశాలు జరగనున్నాయి.

అధికార పార్టీ అన్ని అస్త్రాలను ఇప్పటికే సిద్ధం చేసుకుంది.

ఈ క్రమంలో విపక్షాలు సైతం పలు సమస్యలపై ప్రశ్నించి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.

అఖిలపక్ష సమావేశంలో ధరల పెరుగుదల, భారత్‌-చైనా సరిహద్దు వద్ద పరిస్థితులపై చర్చించాలని విపక్షాలు ప్రభుత్వాన్ని కోరాయి.

మహిళా రిజర్వేషన్‌ బిల్లును తీసుకురావాలని బిజూ జనతా దళ్‌ డిమాండ్‌ చేయగా.. జనాభా నియంత్రణ బిల్లును తీసుకురావాలని శివసేన శిండే వర్గం కోరింది.

ఈ క్రమంలో 17 రోజుల పాటు జరిగే ఈ పార్లమెంట్ సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది.

 

Views: 7
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

అప్పులు చెల్లించలేకపోతున్నారా? దివాలా పిటిషన్ అంటే ఏమిటి.. చట్టం ఏం చెబుతోంది? అప్పులు చెల్లించలేకపోతున్నారా? దివాలా పిటిషన్ అంటే ఏమిటి.. చట్టం ఏం చెబుతోంది?
అప్పులు పెరిగి చెల్లించలేని పరిస్థితి వస్తే దివాలా పిటిషన్ వేయవచ్చా? దివాలా ప్రకటిస్తే అప్పులన్నీ మాఫీ అవుతాయా? రుణగ్రహీత, రుణదాత హక్కులు ఏమిటి? పూర్తి అవగాహన కోసం...
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రూట్‌లో కొత్త స్పెషల్ ట్రైన్స్.. ప్రయాణం మరింత సులభం!
రూపాయిని లక్ష చేసే మైండ్‌సెట్! విజయవంతమైన వ్యాపార కుటుంబాల నుంచి నేర్చుకోవాల్సిన 5 ఆర్థిక రహస్యాలు
లోన్ పూర్తిగా చెల్లించారా? ఈ డాక్యుమెంట్స్ తీసుకోకపోతే తర్వాత పెద్ద సమస్యలు రావచ్చు!
మనీ ప్లాంట్ వాస్తు రహస్యం ఇదే.. ఈ దిక్కులో ఉంచితే శుభమని ఎందుకు చెబుతారు?
జస్ట్ రెండున్నర గంటలే.. హైదరాబాద్‌-విజయవాడ మధ్య 12 లైన్‌ల గ్రీన్‌ఫీల్డ్‌ హైవే.. గేమ్ ఛేంజర్ కానుందా?
#విద్యార్థుల్లో నాయకత్వ స్ఫూర్తి పెంపే లక్ష్యం