ఈ నెల 11న సీబీఐ విచారణకు ఎమ్మెల్సీ కవిత
తెలంగాణలో లిక్కర్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కవిత ఈ నెల 6న సీబీఐ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే సీఎం కేసీఆర్ 7వ తేదీ జగిత్యాలలో పర్యటిస్తుండడంతో, ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నందున తాను విచారణకు హాజరుకాలేనని కవిత సీబీఐ కి సమాచారం పంపారు. 11, 12, 14, 15వ తేదీల్లో ఏ రోజైనా విచారణకు హాజరవుతానని సీబీఐకి మెయిల్ చేశారు. 11వ తేదీన విచారణకు […]
తెలంగాణలో లిక్కర్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి.
ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో కవిత ఈ నెల 6న సీబీఐ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది.
అయితే సీఎం కేసీఆర్ 7వ తేదీ జగిత్యాలలో పర్యటిస్తుండడంతో, ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నందున తాను విచారణకు హాజరుకాలేనని కవిత సీబీఐ కి సమాచారం పంపారు.
11, 12, 14, 15వ తేదీల్లో ఏ రోజైనా విచారణకు హాజరవుతానని సీబీఐకి మెయిల్ చేశారు.
11వ తేదీన విచారణకు వస్తామని సీబీఐ కవితకు సమాచారం పంపింది. దీంతో ఈ నెల 11న కవిత విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.
హైదరాబాద్ లోని కవిత నివాసంలో ఈ విచారణ జరగనుంది.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List