టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్ గా ఎన్నికల సంఘం ఆమోదం

On

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితి గా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అధికారిక లేఖ పంపింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9 శుక్రవారం మధ్యాహ్నం 1:20 నిమిషాలకు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించాలని, అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ భవన్ లో రేపు (శుక్రవారం) ఒంటిగంట 20 నిమిషాలకు, […]

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితి గా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది.

ఈ మేరకు ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అధికారిక లేఖ పంపింది.

ఈ నేపథ్యంలో డిసెంబర్ 9 శుక్రవారం మధ్యాహ్నం 1:20 నిమిషాలకు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించాలని, అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు.

తెలంగాణ భవన్ లో రేపు (శుక్రవారం) ఒంటిగంట 20 నిమిషాలకు, తనకు అందిన అధికారిక లేఖపై రిప్లై సంతకం చేసి ఎన్నికల సంఘానికి అధికారికంగా పంపించనున్నారు.

Read More నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..

అనంతరం సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ జండాను ఆవిష్కరిస్తారు. తెలంగాణ భవన్ లో రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని ముఖ్యమంత్రి కోరారు.

వీరితోపాటు జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ అధ్యక్షులు డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు అందరూ శుక్రవారం మధ్యాహ్నం లోపు తెలంగాణ భవనకు చేరుకోవాలని పార్టీ అధినేత సీఎం కేసిఆర్ పిలుపునిచ్చారు.

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా గుర్చించిన ఈసీ.. త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించింది.

కాగా.. పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చాలంటూ అక్టోబర్‌ 5న ఈసీకి టీఆర్ఎస్ లేఖ రాసింది.

ఈసీ సూచన మేరకు పబ్లిక్‌ నోటీస్ జారీ చేసింది. ఇందులో బీఆర్ఎస్ పేరుపై అభ్యంతరాలు రాలేదు.

దీంతో ఈసీ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఈసీ పచ్చజెండా ఊపడంతో తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత్‌ రాష్ట్ర సమితిగా మారిపోయింది.

గులాబీ జెండా మధ్యలో భారతదేశం ఉండేలా నూతన జెండాను బీఆర్ఎస్ రూపొందించింది. పార్టీ పేరు మారినా కారు గుర్తే కొనసాగనుంది.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి.. నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్, సర్వే నంబర్–38లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్న నమిశ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థపై తక్షణ...
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు