ముందస్తు ఎన్నికలకు కౌంట్ డౌన్
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయా రావా అనే అనుమానాలేం అక్కర్లేదు. ఆల్రడీ కౌంట్‌డౌన్ కూడా మొదలైంది..! సీఎం కేసీఆర్ హఠాత్తుగా, అనూహ్యంగా ప్రకటన చేయడమే మిగిలింది. ప్రగతి భవన్ నుంచి బయటికొస్తున్న ప్రతి సంకేతం.. చాలా స్పష్టంగా ముందస్తు ఎన్నికలను సూచిస్తోంది. నిన్న మంత్రిమండలి సమావేశంలోనూ చెప్పీ చెప్పకుండా.. ముందస్తుకు రెడీగా ఉండండని చెప్పుకొచ్చారు సీఎం కేసీఆర్. నిన్నటి సమావేశంలో రాజకీయాల కంటే కూడా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు గురించే ముఖ్యమంత్రి […]
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయా రావా అనే అనుమానాలేం అక్కర్లేదు.
ఆల్రడీ కౌంట్‌డౌన్ కూడా మొదలైంది..! సీఎం కేసీఆర్ హఠాత్తుగా, అనూహ్యంగా ప్రకటన చేయడమే మిగిలింది.
ప్రగతి భవన్ నుంచి బయటికొస్తున్న ప్రతి సంకేతం.. చాలా స్పష్టంగా ముందస్తు ఎన్నికలను సూచిస్తోంది.
నిన్న మంత్రిమండలి సమావేశంలోనూ చెప్పీ చెప్పకుండా.. ముందస్తుకు రెడీగా ఉండండని చెప్పుకొచ్చారు సీఎం కేసీఆర్.
నిన్నటి సమావేశంలో రాజకీయాల కంటే కూడా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు గురించే ముఖ్యమంత్రి ఫోకస్ పెట్టారు.
ఈ మధ్య జరుగుతున్న ప్రతి సమీక్ష కూడా అభివృద్ధి, సంక్షేమం గురించే ఉంటోంది.
అంటే.. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ముందు.. జిల్లాల్లో ఎక్కడా పెండింగ్ పనులు ఉండొద్దని, సంక్షేమ పథకాల అమలు కూడా సక్రమంగా జరగాలని చెబుతున్నట్టుగా ఉన్నాయి.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List