కవితకు మరో సీబీఐ నోటీసు.. అరెస్ట్ చేస్తారా?

On

తెలంగాణలో లిక్కర్ స్కాం ప్రకంపనలుకొనసాగుతున్నాయి.  లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ పూర్తయింది. కవితను.. సీబీఐ అధికారులు ఏడు గంటలకు పైగా విచారించారు. ఎమ్మెల్సీ కవితను ఆదివారం బంజారాహిల్స్‌లోని ఆమె ఇంట్లోనే సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఉదయం 11 గంటలకు ఆమె ఇంట్లోకి వెళ్లిన సీబీఐ బృందం ఏకధాటిగా విచారణ కొనసాగించింది. మొత్తం రెండు వాహనాల్లో ఆరుగురు సీబీఐ అధికారులు కవిత ఇంటికి వచ్చారు. ఈ బృందంలో ఒక మహిళా సీబీఐ అధికారి కూడా ఉన్నారు. […]

తెలంగాణలో లిక్కర్ స్కాం ప్రకంపనలుకొనసాగుతున్నాయి.  లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ పూర్తయింది. కవితను.. సీబీఐ అధికారులు ఏడు గంటలకు పైగా విచారించారు.

ఎమ్మెల్సీ కవితను ఆదివారం బంజారాహిల్స్‌లోని ఆమె ఇంట్లోనే సీబీఐ అధికారులు ప్రశ్నించారు.

ఉదయం 11 గంటలకు ఆమె ఇంట్లోకి వెళ్లిన సీబీఐ బృందం ఏకధాటిగా విచారణ కొనసాగించింది.

మొత్తం రెండు వాహనాల్లో ఆరుగురు సీబీఐ అధికారులు కవిత ఇంటికి వచ్చారు. ఈ బృందంలో ఒక మహిళా సీబీఐ అధికారి కూడా ఉన్నారు. స్టేట్ మెంట్ రికార్డు అనంతరం.. సీబీఐ అధికారులు సాయంత్రం కవిత ఇంటినుంచి వెళ్లిపోయారు.

Read More అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సాక్షిగా కవిత నుంచి.. సీబీఐ అధికారులు పలు కీలక వివరాలు సేకరించారు.

Read More మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..

సీబీఐ డీఐజీ రాఘవేంద్ర నేతృత్వంలో విచారణ జరిగింది. విచారణ అనంతరం కవిత ప్రగతి భవన్‌కి వెళ్లి కేసీఆర్ తో సమావేశమయ్యారు

సీబీఐ DIG రాఘవేంద్ర ఆధ్వర్యంలో కవిత స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేశారు. లిక్కర్ స్కాంకి సంబంధించి కీలక అంశాలపై ఆమె వివరణ తీసుకున్నట్లు తెలుస్తోంది.

కవిత అడ్వకేట్‌ సమక్షంలో ఆమె స్టేట్మెంట్‌ను నమోదు చేశారు. మనీష్‌ సిసోడియా పాత్రతో పాటు పలు అంశాలపై సీబీఐ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్.. అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం.. రంగారెడ్డి జిల్లా, మంచాల, మార్చి 07, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఇందిరమ్మ ఇల్లును ప్రారంభిస్తున్న సర్పంచ్ మంథని శివ యాదవ్.. ఇబ్రహీంపట్నం...
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన
ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి
రేపటి భవిష్యత్తు వినూత్నంగా ఆలోచించే విద్యార్థులదే
జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ 
పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత