అసహజ రీతిలో భార్యపై భర్త, అతని స్నేహితుల అత్యాచారం

On

ఓ వివాహితపై భర్తతోపాటు అతని నలుగురు స్నేహితులు సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో జరిగింది. ఓ వివాహితపై ఆమె భర్త, అతని నలుగురు స్నేహితులు సామూహిక అత్యాచారం చేసి,ఆమె ప్రైవేటు భాగంపై సిగరెట్లతో కాల్చి చిత్రహింసలకు గురిచేశారని పోలీసులు తెలిపారు.ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులుతెలిపారు. తన భర్త, నలుగురు ఇతరులు తనపై అసహజ శృంగారం జరిపి, తన ప్రైవేట్ భాగాలను సిగరెట్‌తో కాల్చి తనను హింసించారని వివాహిత […]

ఓ వివాహితపై భర్తతోపాటు అతని నలుగురు స్నేహితులు సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో జరిగింది. ఓ వివాహితపై ఆమె భర్త, అతని నలుగురు స్నేహితులు సామూహిక అత్యాచారం చేసి,ఆమె ప్రైవేటు భాగంపై సిగరెట్లతో కాల్చి చిత్రహింసలకు గురిచేశారని పోలీసులు తెలిపారు.ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులుతెలిపారు.

తన భర్త, నలుగురు ఇతరులు తనపై అసహజ శృంగారం జరిపి, తన ప్రైవేట్ భాగాలను సిగరెట్‌తో కాల్చి తనను హింసించారని వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది.లైంగిక వేధింపులను తాను ప్రతిఘటించడంతో వారు చంపేస్తామని బెదిరించారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఇండోర్‌లోని షిప్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఫామ్‌హౌస్‌లో తనపై సామూహిక అత్యాచారం జరిగిందని వివాహిత ఆరోపించింది.

ఛత్తీస్‌గఢ్‌ మహిళ ఇండోర్‌కు చెందిన నిందితుడిని మ్యాట్రిమోనియల్ సైట్‌లో కలిసిన తర్వాత వివాహం చేసుకుంది. అయితే ఆ వ్యక్తికి అప్పటికే పెళ్లయిందని పోలీసు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.ఎలాగోలా ఫామ్‌హౌస్ నుంచి తప్పించుకుని ఛత్తీస్‌గఢ్‌లోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లినట్లు ఫిర్యాదుదారు పోలీసులకు తెలిపారు. బాధితురాలి భర్తతో సహా ఐదుగురిపై భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలోని వివిధ ప్రాంతాల నుంచి నిందితులను అరెస్టు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News