అవినీతిపై చర్యలేవి: రేవంత్‌ రెడ్డి

On

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి. ప్రాజెక్టులో అవినీతిపై “ది న్యూస్ మినిట్‌” అనే పోర్టల్ ఆధారాలతో సహా ప్రచురించిందన్నారు. దీనిపై సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు రేవంత్. ప్రాజెక్టు పనులు చూస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ రజత్‌ కుమార్ అవినీతికి పాల్పడ్డారని కథనంలో పేర్కొన్నారన్నారు. రజత్‌ కుమార్ కుమార్తె పెళ్లి ఖర్చులకు కాళేశ్వరం కాంట్రాక్టు పొందిన..మేఘా దాని షెల్ కంపెనీల చెల్లింపులు చేశాయన్నారు. వివాహ వేడుకకు […]

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి. ప్రాజెక్టులో అవినీతిపై “ది న్యూస్ మినిట్‌” అనే పోర్టల్ ఆధారాలతో సహా ప్రచురించిందన్నారు. దీనిపై సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు రేవంత్.

ప్రాజెక్టు పనులు చూస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ రజత్‌ కుమార్ అవినీతికి పాల్పడ్డారని కథనంలో పేర్కొన్నారన్నారు. రజత్‌ కుమార్ కుమార్తె పెళ్లి ఖర్చులకు కాళేశ్వరం కాంట్రాక్టు పొందిన..మేఘా దాని షెల్ కంపెనీల చెల్లింపులు చేశాయన్నారు. వివాహ వేడుకకు షెల్ కంపెనీలు 50లక్షలకు పైగా రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు రేవంత్‌ రెడ్డి.

ప్రస్తుతం సాగునీటిశాఖ సీఎం దగ్గరే ఉందన్నారు రేవంత్‌ రెడ్డి. ఆరోపణలు వచ్చిన అధికారి కేసీఆర్ పర్యవేక్షణలోనే పనిచేస్తున్నారని తెలిపారు. 2 రోజులు దాటినా ఆరోపణలపై ఖండన రాకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రభుత్వ పెద్దలకు కాంట్రాక్టర్ నుంచి వేల కోట్ల ముడుపులు అందాయనే ఆరోపణలు ఉన్నాయన్నారు. వీటిపై విచారణ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.