రావిపాడు రోడ్డు సెంటర్ లో ప్రమాదాలు నిత్య కృత్యం...

సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదాలు..

On
రావిపాడు రోడ్డు సెంటర్ లో ప్రమాదాలు నిత్య కృత్యం...

IMG-20230921-WA0204ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని స్థానిక రావిపాడు రోడ్డు సెంటర్ ప్రాంతంలో రహదారి ప్రమాదాలు నిత్య కృత్యం అనడంలో అతిశయోక్తి లేదు. ఇది అక్షర సత్యం. కంభం పట్టణం ఎరిగిన నిజం. హైవే ఆక్రమణలకు గురై, ప్రతి రోజూ ఏదో ఒక ప్రమాదం చిన్న చిన్న గాయాలు లేదా తీవ్ర గాయాలు కావడం ఆ ప్రాంతంలో తిరిగే వాహనదారులకు అలవాటైంది. 

భయబ్రాంతులకు గురవుతున్న స్థానికులు, వాహనదారులు..

ఆ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులు బైక్ మెకానిక్ లు, వాటర్ ప్లాంట్, బాదంపాలు బండి, టిఫిన్ సెంటర్లు, టీ షాపులు, కూరగాయల షాపులు, ఇలా అన్ని రకాల షాపులు రావిపాడు రోడ్డు సెంటర్ లో హైవే రోడ్డు ఫుట్ పాత్, డ్రైనేజీ కాలువను పూర్తిగా ఆక్రమించి వ్యాపారస్తులు ముందుకు రావడమే కారణం అని కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అయినా హైవే అధికారులు, ఇంకా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం, చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు, వాహనదారులు భయబ్రాంతులకు గురవుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఇక్కడ కనీసం హెచ్చరిక బోర్డ్లు కానీ, ప్రమాదాల జోన్ అని తెలియపరచకపోవడం కూడా ప్రమాదాలకు ఒక కారణమే.

ఆక్రమణలు తొలగించి, శాశ్వత పరిష్కారం చూపించండి..

ఆ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులు అనగా బైక్ మెకానిక్ ల బైకులు, వాటర్ ప్లాంట్ వాళ్ల ఆటోలు, బాదంపాలు బండి, టిఫిన్ సెంటర్లు, టీ షాపులు, కూరగాయల షాపులు అన్నింటినీ ఫుట్ పాత్, డ్రైనేజీ కాలువ వెనక వరకు తీపించడం, అలానే హెచ్చరిక బోర్డులు, ప్రమాదాల జోన్ బొర్డ్లు వేపించం అత్యవసరం. ముఖ్యంగా వార్తా పత్రికలలో వచ్చినప్పుడు అప్పటికప్పుడు హడావుడి చేసి అన్నింటినీ తొలగించి, మళ్లీ రెండు రోజుల తరువాత నుండి యధాతధంగా ఆక్రమణలు జరిగినా అధికారులు చూస్తూ ఉంటే ప్రజల ప్రాణాలు పొక తప్పవని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఒకసారి చేశారు కానీ, మళ్లీ పట్టించుకోకపోవడంతో వ్యాపారస్తులు యధాతధంగా ఆక్రమణలు చేసి ముందుకు వచ్చారు. 'రెడ్డి వచ్చే మొదలెట్టు' అన్న చందానా వ్యాపారస్తులు యధాతధంగా ఆక్రమించారు, ప్రమాదాలు కూడా యధాతధంగా జరుగుతూనే ఉన్నాయి. ఇలా కాకుండా వ్యాపారస్తులకు గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చి, ఆక్రమణలు తొలగించి శాశ్వత పరిష్కారం చేయాలని, ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.ట్రాఫిక్ సమస్యతో జాతీయ రహదారి ట్రాఫిక్ సమస్యతో జాతీయ రహదారి

Views: 209
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఆప్యాయత చిరునామా అమ్మ .. ఆప్యాయత చిరునామా అమ్మ ..
అమ్మకదిలే దైవం అమ్మ హృదయమే కోవెల అమ్మ ఆప్యాయత చిరునామా అమ్మ అనురాగం వీలునామ అమ్మరెండు అ..క్షరాల పరవశం అమ్మపెదవే పలికిన తీయని మాటే అమ్మతేనె లొలికే...
సమాజ హిత "విజయ"గర్వం...
జిల్లాలో బాలికల, విద్యార్థినిల, మహిళల కు ‘సంగారెడ్డి జిల్లా పోలీసు షీ-టీమ్స్ రక్షణ’.
నిందితులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే, ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.
ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.