టీ కాంగ్‌లో జగ్గారెడ్డి తుఫాన్!

On

కాంగ్రెస్‌…అంటేనే కలహాలు, విబేధాలు. ఎవరూ ఎప్పుడూ ఎటు వైపు ఉంటారో…ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చెప్పడం కష్టం. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశించిన కార్యకర్తలకు ఆశాభంగం తప్పడం లేదు. మొన్నటివరకు కోమటిరెడ్డి, తాజాగా జగ్గారెడ్డి…ఇలా రోజుకో నేత తీరుతో పార్టీ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నాయి. ఐతే జగ్గారెడ్డి సమస్య టీ కప్పులో తుఫాను లాంటిదన్నారు రేవంత్ రెడ్డి. కుటుంబ సమస్య అని దాన్ని పరిష్కరించుకుంటామని చెప్తున్నారు. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాక..తెలంగాణలో […]

కాంగ్రెస్‌…అంటేనే కలహాలు, విబేధాలు. ఎవరూ ఎప్పుడూ ఎటు వైపు ఉంటారో…ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చెప్పడం కష్టం. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశించిన కార్యకర్తలకు ఆశాభంగం తప్పడం లేదు.

మొన్నటివరకు కోమటిరెడ్డి, తాజాగా జగ్గారెడ్డి…ఇలా రోజుకో నేత తీరుతో పార్టీ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నాయి. ఐతే జగ్గారెడ్డి సమస్య టీ కప్పులో తుఫాను లాంటిదన్నారు రేవంత్ రెడ్డి. కుటుంబ సమస్య అని దాన్ని పరిష్కరించుకుంటామని చెప్తున్నారు.

రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాక..తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచినట్లు కనిపించింది. హుజురాబాద్ ఎలక్షన్ టైంలో టీఆర్‌ఎస్ సర్కారు ప్రవేశపెట్టిన దళిత బంధు పథకానికి కౌంటర్‌గా దళిత, గిరిజన దండోరా పేరుతో సభలు నిర్వహించి…అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు రేవంత్‌. ఐతే రేవంత్‌కు పీసీసీ ఇవ్వడంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

పీసీసీ కోసం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఐతే అధిష్టానం రేవంత్‌ను పీసీసీగా ఖరారు చేయడంతో పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు కోమటిరెడ్డి. ఇటీవల కేసీఆర్ జనగాం పర్యటనలో కోమటిరెడ్డి కామెంట్స్ మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. కేసీఆర్‌తో కోమటిరెడ్డి సన్నిహితంగా మెదలడం కూడా చర్చనీయాంశమైంది. దీంతో రేవంత్ స్వయంగా కోమటిరెడ్డి ఇంటికి వెళ్లి మాట్లాడారు. కలిసికట్టుగా పార్టీ కోసం పోరాడుతామని ప్రకటించారు.

Read More అంబేద్కర్ కు ఘన నివాళులర్పించిన: ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి...

ఇక రేవంత్ తీరుపై మొదటి నుంచి బహిరంగ విమర్శలు చేస్తూ వచ్చిన జగ్గారెడ్డి..పలు సార్లు అధిష్టానానికి పీసీసీ తీరుపై ఫిర్యాదు చేశారు. తనకు చెప్పకుండానే తన నియోజకవర్గంలో రేవంత్ పర్యటించడాన్ని తప్పుపట్టారు.

Read More దశలవారీగా మున్సిపాలిటీ అభివృద్దె లక్ష్యం...

ఇక జగ్గారెడ్డి తాజా ఎపిసోడ్‌తో కాంగ్రెస్‌ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చిందా అన్న చర్చ మొదలైంది.

తెలంగాణలో ప్రతిపక్ష హోదా కోసం తీవ్రంగా శ్రమిస్తున్న బీజేపీ.. 2023 ఎన్నికలపై కన్నేసింది. టీఆర్ఎస్ సైతం ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో అందరూ కలిసికట్టుగా ముందుకు సాగితేనే కాంగ్రెస్‌కు పూర్వవైభవం సాధ్యం. రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ హైకమాండ్ అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. లేకుంటే కాంగ్రెస్ కథ మళ్లీ మొదటికే వస్తుంది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News