గడ్డి మందు పిచికారి చేయడంతో ధ్వంసమైన పత్తి పంట

గడ్డి మందు పిచికారి చేయడంతో ధ్వంసమైన పత్తి పంట

 

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని పులిగిల్ల గ్రామంలో పత్తి చేనుపై గడ్డి మందును పిచికారి చేయడం వల్ల 13 ఎకరాల పత్తి చేను మొత్తం ధ్వంసం కావడం జరిగింది. పులిగిల్ల గ్రామానికి చెందిన మంద బిక్షపతి, వేముల మధు, బుగ్గ మల్లయ్య లు ముగ్గురు  కలిసి ఒక వ్యక్తి వద్ద104 సర్వే నెంబర్ లోని 13 ఎకరాల భూమిని లీజుకు తీసుకొని పత్తి చేను వేయడం జరిగింది. భూమిని లీజుకు ఇచ్చిన వ్యక్తికి వాళ్ళ అన్న పైళ్ళ పురుషోత్తం రెడ్డి కి మనస్పర్ధలు ఉండడంతో వారిరువురి పగతో వీళ్ళ యొక్క పత్తి చేనుమీద రాత్రికి రాత్రే డ్రోన్ సహాయంతో గడ్డి మందు పిచికారి చేయడంతో 13 ఎకరాల పత్తి చేను మొత్తం మాడిపోయిందని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బాధితులు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని నష్టపరిహారం చేకూర్చాలని మీడియాతో వాపోయారు.

Views: 472
Tags:

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.