మహిళా బిల్లు ఆమోదం పై హర్షం.. మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం

బిజెపి మహిళా మోర్చా తొర్రూరు అర్బన్ మండలం అధ్యక్షురాలు పల్లె రజిత

మహిళా బిల్లు ఆమోదం పై హర్షం.. మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం

IMG-20230923-WA0130
 మహిళల కు 33శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంట్ ఉభయ సభలు బిల్లు ఆమోదం పొందడం పై హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు బీజేపీ మహిళా మోర్చా తొర్రూరు శాఖ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి మహిళా మోర్చా తొర్రూరు అర్బన్ మండలం అధ్యక్షురాలు పల్లె రజిత మాట్లాడుతూ గత డెబ్బై ఏళ్ళుగా మహిళా బిల్లు విషయంలో నాన్చివేత ధోరణి అవలంభించి  గత ప్రభుత్వాలు మహిళా లోకాన్ని మోసం చేశాయని ఆరోపించారు.ప్రదాని నరేంద్ర మోడీ గారి నేత్రృత్వంలో నేడు మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టఢం ఉభయ సభలు భారీ మెజారిటీతో ఆమోదించడం మహిళా లోకానికి మోడీ గారి కానుకగా అభివర్ణించారు.నరేంద్ర మోడీ గారి తోనే మహిళా సాధికారత సాద్యం అని తెలిపారు.మహిళలను కేవలం వంటింటి కే పరిమితం చేయాలనుకునే ఠుహానా పార్టీలకు ఈ మహిళా బిల్లు చెంప పెట్టు అని తెలిపారు.మహిళా భిల్లును అడ్డుకున్న  కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలే నేడు గఫ్పాలు కొట్టుకోవడం సిగ్గు చేటని తక్షణమే ఆ పార్టీ లు మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ మహిళా బిల్లు భారత రాజకీయ చరిఉసువర్ణాక్షరాలతో లిఖించదగినదని కొనియాడారు.భారత మహిళా లోకం యావత్తూ ఇంతటి గొప్ప కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి మహిళలు అన్ని రంగాల్లో ముందుండే విధంగా క్రృషి చేసిన ప్రధాని నరేంద్ర మోడీ గారి కి అండగా నిలిచి మద్దతు తలిపాలని కోలారు.ధేశంలో మహిళా నాయకత్వం పార్లమెంట్, అసెంబ్లీ లో పెరిగి మహిళాభ్యుదయం తోనే ధేశాభీవ్రృద్ది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి,రజియా,రామతార,ఉమ, యశోద, అంజమ్మ,యమున, సరస్వతి,కీర్తి, తదితరులు పాల్గొన్నారు.

Views: 12
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన
ఘనంగా బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ