చదువుతోపాటు క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు..

జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థినీలు విజయకేతనం రాష్ట్రస్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థినీలు ఎంపిక

On

జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థినీలు విజయకేతనం రాష్ట్రస్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థినీలు ఎంపిక

జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థినీలు విజయకేతనం

రాష్ట్రస్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థినీలు ఎంపిక...

చదువుతోపాటు క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు..

కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ నాగజ్యోతి..

Read More ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ మంథని శివ యాదవ్. 

విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ముఖ్యమేనని క్రీడల్లో రాణించి దేశ కీర్తి ప్రతిష్టలు నింపాలని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ నాగజ్యోతి అన్నారు. ఎస్ జి ఎఫ్ ఐ 67వ నేషనల్ స్కూల్ గేమ్స్ రంగారెడ్డి జిల్లా స్థాయి లెవెల్ కబడ్డీ సెలక్షన్స్ తెలంగాణ రాష్ట్ర క్రీడల అధ్యక్షుడు రాఘవరెడ్డి, భాస్కర్ రెడ్డి, సరూర్నగర్ జోన్ సెక్రటరీ ఉషా కిరణ్, డాక్టర్ నరసింహ యాదవ్, కోచ్ శ్రీను ఆధ్వర్యంలో ఎంపికైన కబడ్డీ క్రీడాకారులు ఈ నెల 23వ తేదీన జిల్లా లెవెల్ కబడ్డీ సెలక్షన్స్ అండర్ 14 /17 గర్ల్స్ విభాగం హైదరాబాద్ లింగంపల్లి చీరిక్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి  క్రీడా పోటీలలో ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థినీలు జిల్లా స్థాయి కబడ్డీ క్రీడా పోటీల్లో విజయం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన విద్యార్థినీలు ముస్కాన్ వైశాలి, సుస్మిత, సోనాలి లు ఉన్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ నాగజ్యోతి మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడా పోటీలలో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని చాటుకోవాలన్నారు. విద్యార్థినీలు రాష్ట్రస్థాయి పోటీలలో విజయం సాధించి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. చదువుతోపాటు క్రీడారంగంలో ప్రతిభ కనబరిచడం ద్వారా భవిష్యత్తులో ఉద్యోగాలు పొందేందుకు క్రీడలకు ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుందని సూచించారు. ప్రతి విద్యార్థి క్రీడారంగంలో రాణించి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఉద్బోధించారు. అనంతరం పిఈటి చిప్పలపేల్లి సురేష్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్క విద్యార్థి మంచిగా చదువుకొని భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడలతో మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. దేహదారుఢ్యంతో మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని స్పష్టం చేశారు. విద్యార్థులు తమ అనుకున్న రంగంలో రాణించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థినిలకు సూచించారు. విద్యార్థులను క్రీడల్లో నిష్టాతులుగా తయారుచేసిన పీఈటి చిప్పలపేల్లి సురేష్ ను ప్రత్యేకంగా ప్రిన్సిపల్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read More గీత కార్మిక సొసైటీ అధ్యక్షుడిగా నక్క శివలింగం ఏకగ్రీవ ఎన్నిక..

Views: 42
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి
డోర్నకల్ : యువత రాజకీయాల్లోకి రావాలన్న  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి ప్రజలకు సేవ చేసేందుకు  డోర్నకల్ మున్సిపల్ ఎన్నికల్లో...
మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి
మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో  ఘనంగా పరాక్రమ్ దివాస్
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ మంథని శివ యాదవ్. 
గీత కార్మిక సొసైటీ అధ్యక్షుడిగా నక్క శివలింగం ఏకగ్రీవ ఎన్నిక..
అన్ని వసతులతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు..
త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆర్రైవ్, అలైవ్