ఎన్.సి.ఆర్.సి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ చైర్మన్ గా నియమితులైన శివంత్ రెడ్డి

On
ఎన్.సి.ఆర్.సి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ చైర్మన్ గా నియమితులైన శివంత్ రెడ్డి

జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్(NCRC) వినియోగదారుల హక్కుల పరిరక్షణలో యవత్ దేశవ్యాప్తంగా తనదైన శైలిలో విస్తృతంగా పనిచేస్తూ ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో NCRC సేవలను మరింతగా విస్తృతం చేసే దిశగా రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర జాతీయ వినియోగదారుల హక్కుల కమిషను, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ఛైర్మన్ గా శివంత్ రెడ్డిని నియమించారు. జాతీయ వినియోగదారుల హక్కుల కమిషను వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎంవీఎల్ నాగేశ్వరరావు బుధవారం శివంత్ రెడ్డికి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శివంత్ రెడ్డి మాట్లాడుతూ... తనను జాతీయ వినియోగదారుల హక్కుల కమిషను తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ఛైర్మన్ నియమించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆయన మాట్లాడుతూ వినయోగదరులు మోసపోకుండా అప్రమత్తంగా ఉండటానికి సమాచారం అందచేయడం, విషయపరిజ్ఞానం కలిపించడం జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ద్వారా జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో ఎవరి సమస్యను వారు పరిష్కరించుకునే విధంగా అవగాహన కలిపించడమే తమ ముఖ్య లక్ష్యమని తెలియజేశారు. ఈరోజు నిత్యావసర వస్తువుల మరియు ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్నారు, అలాంటి వారిపై కూడా మేము ఉక్కుపాదం మోపి, వినియోగదారులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను మనస్సాక్షిగా నిర్వహిస్తామన్నారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన డాక్టర్ ఎంవీఎల్ నాగేశ్వరరావుకు ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు. కాగా ఎన్ సీఆర్ సీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ఛైర్మన్ గా నియమించబడిన శివంత్ రెడ్డికి పలువురు అభినందించడంతో పాటు శుభాకాంక్షలు తెలియచేశారు.

Views: 15
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..? అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..? కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఫైర్.. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రంగారెడ్డి జిల్లా...
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?
ఉద్యోగ మేళ
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!
పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..