మహారాష్ట్ర వాసిని ఆదుకున్న సురక్ష సేవా సంఘం..

పది రోజులుగా రక్తదాతల కొరకు ఎదురుచూపు..

On
మహారాష్ట్ర వాసిని ఆదుకున్న సురక్ష సేవా సంఘం..

సురక్ష సేవా సంఘం చోర్వతో ఆపరేషన్ విజయవంతం.

IMG-20230927-WA1457
సురక్ష సేవా సంఘం తెలంగాణ అధ్యక్షులు కిక్కర గోపి శంకర్ యాదవ్

గుండెకు రంధ్రం పడి విషమ పరిస్థితుల్లో ఉన్న హృద్రోగి కి రక్తదానం చేసిన సురక్ష సేవా సంఘం తెలంగాణ అధ్యక్షులు కిక్కర గోపి శంకర్ యాదవ్ ఆసరాగా నిలిచారు. లతా వాల్కే మహారాష్ట్రకు చెందిన రాజ్ పూర్ వాసి ఒక హాస్పటల్లో ఆయా గా పనిచేస్తుంది. చాలా పేద కుటుంబం తన చిన్న కుమారుడు సంచిత్ విజయ్(21) కు ఈ మధ్యకాలంలో గుండెకు రంధ్రం పడి పరిస్థితి విషమంగా మారింది. దీనికి సంబంధించిన వైద్యం హైదరాబాదులో ఉందని తెలుసుకుని హైదరాబాద్ కు రావడం జరిగింది. ఆపరేషన్ అవసరం ఉండగా గత పది రోజులుగా ఎంతో మందిని రక్తం కోసం అభ్యర్థన చేయడం జరిగింది, కానీ ఫలితం లేదు. చివరికి తెలిసిన వ్యక్తుల ద్వారా సురక్ష సేవా సంఘం దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించిన సురక్ష సేవా సంఘం రక్తదాతలను ఏర్పాటు చేసి సరైన సమయంలో రక్తదానం చేసి సంచిత్ గుండె ఆపరేషన్ విజయవంతం అవడంలో భాగస్వాములు అయ్యారు. తన కుమారుడి గుండె ఆపరేషన్ కి సకాలంలో రక్తదానం చేసి సహకరించిన సురక్ష సేవా సంఘం సభ్యులకు సంచిత్ తల్లి లత ధన్యవాదాలు తెలియజేశారు.

Views: 19
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, ఆగస్టు 13: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం భీముని తండాలో గుడుంబా తయారీ, విక్రయాలపై తొర్రూరు పోలీసులు దాడులు నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున...
అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..
మాకు ఈ టీచర్ వద్దు.. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి
కార్పొరేట్ విధానాలను నిరసిస్తూ జైలు భరో
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఐ ప్రజా చైతన్య ప్రచార యాత్ర
ఏపీ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం..
ప్రీ ఎయిమ్ కిడ్స్ స్కూల్‌లో ఘనంగా బోనాల సంబరాలు