గణనాధునికి ఘనంగా పూజలు
అన్నదాత ప్రభువులు మాజీ సర్పంచ్ రాజు నాయక్ ,ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి
అన్నం వడ్డిస్తున్న అన్నదాన ప్రభువులు
వినాయక నవరాత్రులు పురస్కరించుకొని యాచారం మండలం నందివనపర్తి గ్రామానికి అనుసంధానమైన కొమ్మంభాయ్ విఘ్నేశ్వరుని సన్నిధానం వద్ద మాజీ సర్పంచ్ రాజు నాయక్, ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి బుధవారం గణేశుడి ప్రాణ ప్రతిష్ఠ, కలశ పూజలు నిర్వహించారు. పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఏకదంతుడి ఆశీర్వాదంతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.స్వామి వారికి భక్తి శ్రద్దలతో భజన కార్యక్రమాలు చేసారు.ఆ విగ్నేశ్వరుడు ప్రజల జీవితాల్లో ఎదుర్కొంటున్న అన్ని విఘ్నాల నుండి విముక్తి కలిగించాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List