పేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లబాబూరావుకు ఎదురుగాలి
ఓడిపోవడం ఖాయమని సర్వే రిపోర్టులు
నామినేటెడ్ పదవిపై కన్నేసిన బాబూరావు
పేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు ఎదురుగాలి వీస్తోంది. ఇప్పటికే టికెట్ ఇచ్చేది లేదంటూ హైకమాండ్ తేల్చిచెప్పడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. కేడర్ అంతా ఒక వైపు ఉంటే తానొక్కడినే మరో వైపు ఉండటం సరికాదనే నిర్ణయానికి వచ్చారు. అయితే మరి పాయకరావుపేటలో వైసీపీ పరిస్థితి ఏంటి?
అనకాపల్లి జిల్లాలో పాయకరావుపేట నియోజకవర్గానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఎస్సీ రిజర్వుడైన ఈ స్థానం నుంచి వైసీపీ తరపున గొల్ల బాబూరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ సారి అంతర్గతంతో వైసీపీ కేడర్ తో బాబూరావుకు పొసగడం లేదు. అటు హైకమాండ్ కూడా బాబూరావును మార్చే యోచ,నలో హైకమాండ్ ఉండటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో బాబూరావు ఉన్నారు.
తాను పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయం కావడంతో.. మరో కొత్త అభ్యర్ధికి మద్దతు ఇచ్చి గెలిచిన తర్వాత ఏదైనా నామినేటెడ్ పదవి తీసుకునే యోచనలో బాబూరావు ఉన్నట్లు తెలుస్తోంది.
అటు టీడీపీ నుంచి బలమైన అభ్యర్ధి దిగుతారనే సమాచారంతో వైఎస్ఆర్ సీపీ కూడా బలమైన అభ్యర్ధిని దింపే యోచనలో ఉంది. అందుకోసం ఇప్పటికే నియోజకవర్గంలో ఒక కార్పొరేషన్ చైర్ పర్సన్ అయినటువంటి మహిళా నేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List