బండి రమేష్ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: శేర్లింగంపల్లి అక్టోబర్ 2 (న్యూస్ ఇండియా తెలుగు)

On
బండి రమేష్ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

శేర్లింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్  మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బండి రమేష్ క్యాంప్   కార్యాలయం అవరణంలో  మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 

అనంతరం బండి రమేష్ మాట్లాడుతూ గుజరాత్ రాష్ట్రంలో ఓ సామాన్య మానవునిగా పుట్టిన మహాత్మ గాంధీజీ తెల్లదొరలను శాంతి, అహింస అనే ఆయుధాలతో తరిమి కొట్టేందుకు ఎన్నో పోరాటాలు చేశారు. ఈ సమయంలో యావత్ భారతావని అంతా అతని శాంతియుత పోరాటానికి మద్దతు పలికింది. కోట్లాది మంది జనాలు ఆయన వెంట నడిచారు. ఈ సందర్భంలోనే ఆయన విశ్వం మొత్తానికి ఆదర్శంగా నిలిచారు. అలాంటి మహోన్నత వ్యక్తికి స్వాతంత్య్రం రాకముందు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. అయినా వాటన్నింటనీ అధిగమించి మహాత్ముడు ఓ వ్యక్తి నుండి మహాశక్తిలా మారాడు. బ్రిటీష్ వారు మన దేశం నుండి వెళ్లిపోయేందుకు సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, స్వదేశీ వంటి ఉద్యమాలు ఎన్నో చేశారు. భారత దేశం గర్వించదగిన మహనీయులలో మహాత్మా గాంధీ ఒకరు అని చెప్పేకంటే.. అందరికంటే ముందుంటారు అని చెప్పొచ్చు. భారతావనికి స్వేచ్ఛా స్వాతంత్య్రం అందించడం కోసం చేసిన పోరాటానికి గాంధీజీ ఎంచుకున్న శాంతి, అహింస మార్గం భారతీయులకే కాదు.. యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది. అందుకే ఆయన మహాత్ముడు అయ్యారు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ శర్మ, మురళీధర్ రావు, తెప్ప బాలరాజు ముదిరాజ్, కృష్ణ గౌడ్, సత్యా రెడ్డి, అంజత్ అమ్ము,సత్తయ్య,ఉమేష్, దేవేందర్ రావు, పూజ, వెంకటేశ్వరరావు, వాసు, సుబ్బారెడ్డి,సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Views: 6
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక