లారీ ఢీకొట్టడంతో మహిళ మృతి
On
లారీ ఢీకొట్టడంతో మహిళ మృతి చెందిన ఘటన వలిగొండ మండలంలోని మాందాపురం గ్రామ శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీబీనగర్ మండలం రాఘవపురం గ్రామానికి చెందిన అడ్డగుల్ల కిరణ్ అతని భార్య అడ్డగుల్ల లక్ష్మి(36)తో కలిసి తన బైక్ పై వలిగొండలో ఇటీవల తన మామ మరణించడంతో ఐదవ రోజు దినకర్మకు వలిగొండకు వెళ్ళుచుండగా మాందాపురం గ్రామ శివారులోకి రాగానే లారీ వారి బైకును వెనుకనుండి ఢీకొట్టడంతో బండి మీద నుంచి లక్ష్మి కిందపడగా ఆమె తలపై నుంచి లారి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఫిర్యాదుదారుడు ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని వలిగొండ ఎస్సై పెండ్యాల ప్రభాకర్ తెలియజేశారు.
Views: 810
Tags:
Comment List