"కాంతితో క్రాంతి" కార్యక్రమంలో దాదా..
కంభం న్యూస్ ఇండియా
తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు కాంతితో క్రాంతి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ ముస్లిం మైనార్టీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి అత్తర్ షేక్ హుస్సేన్ దాదా ఆధ్వర్యంలో తన స్వగృహం నందు ఘనంగా శాంతియుత నిరసన తెలిపారు.ఈ కార్యక్రమం లో తమ కుటుంబ సభ్యులతో పాటు పలువురు టీడిపి అభిమానులు హాజరయ్యారు.ఇందులో భాగంగా విద్యుత్ దీపాలను ఆపి మొబైల్ ఫోన్ లైట్ లను వేస్తూ,కొవ్వొత్తులను వెలిగించి నిరసన తెలిపారు.అలానే బాబు కోసం మేము సైతం అంటూ నినాదాలు పలికారు.ఈ సందర్భంగా దాదా మాట్లాడుతూ బాబు మీద ఎన్ని కుట్రలు పన్నినా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా టీడిపి బయపడదు అని అన్నారు. బాబుపైన పెట్టినా కేసు అక్రమ కేసు అని ప్రజలు అందరూ నమ్ముతున్నారని త్వరలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెపుతారని అన్నారు.నారా చంద్రబాబు నాయుడు బయటకి వచ్చేవరకు ఇలాంటి శాంతియుత నిరసనలు మున్ముందు ఎన్నో జరుగుతాయని తెలిపారు.

Comment List